te_tw/bible/other/prince.md

5.1 KiB

రాజకుమారుడు, రాజకుమారులు, రాజకుమారి, రాజకుమార్తెలు

నిర్వచనము:

“రాజకుమారుడు” అనగా రాజుకు పుట్టిన వ్యక్తియైయుండును. “రాజకుమారి” అనగా రాజుకు పుట్టిన కుమార్తెయైయుండును.

  • “రాజకుమారుడు” అనే ఈ పదము అనేకమార్లు అలంకారికముగా ఒక నాయకుడుకి, ఒక పాలకునికి లేక ఇతర శక్తివంతమైన వ్యక్తికి ఉపయోగించబడినది.
  • అబ్రాహాము యొక్క సంపద మరియు ప్రాముఖ్యత కారణంగా అతను హిత్తీయుల మధ్యన నివసించుట ద్వారా వారందరూ అతనిని “రాజకుమారుడు” అని పిలిచిరి.
  • దానియేలు గ్రంథములో “రాజకుమారుడు” అనే పదమును “పారసీకుల రాజకుమారుడు” మరియు “గ్రీకుల రాజకుమారుడు” అనే మాటలలో ఉపయోగించబడినది. బహుశః ఆ సందర్భములు అటువంటి ప్రాంతముల మీద అధికారమును కలిగియున్న శక్తివంతమైన దుష్ట ఆత్మలను సూచిస్తుంది.
  • ప్రధాన దూత మికాయేలును కూడా దానియేలు గ్రంథములో “అధిపతి” అని సూచించబడియున్నాడు.
  • పరిశుద్ధ గ్రంథములో కొన్నిమార్లు సాతానుని “ఈ లోక పాలకుడు” అని సూచించబడియున్నది.
  • యేసు “సమాధాన అధిపతి” అని మరియు “జీవాధిపతి” అని పిలువబడెను.
  • అపొ.కార్య.2:36వ వచనములో యేసును గూర్చి “ప్రభువు మరియు క్రీస్తు” అని చెప్పబడియున్నది మరియు అపొ.కార్య.5:31వ వచనములో ఆయనను “అధిపతి మరియు రక్షకుడు” అని పిలువబడెను, “ప్రభువు” మరియు “రాజకుమారుడు (అధిపతి)” అని సమాంతర అర్థములుగా చూపించబడుట.

తర్జుమా సలహాలు:

  • “రాజకుమారుడు” అని తర్జుమా చేయు విధానములో “రాజు యొక్క కుమారుడు” లేక “పాలకుడు” లేక “నాయకుడు” లేక “సేనాపతి” లేక “సేనాధిపతి” అనే పదాలను ఉపయోగిస్తారు.
  • దూతలను సూచించి చెప్పునప్పుడు, ఈ పదమును “ఆత్మ పాలకుడు” లేక “నడిపించు దూత” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సాతానును లేక ఇతర దుష్ట ఆత్మలను సూచించి చెప్పునప్పుడు, ఈ పదమును “దుష్ట ఆత్మ నాయకుడు” లేక “శక్తివంతమైన ఆత్మ నాయకుడు” లేక “పాలించు ఆత్మ” అని కూడా సందర్భాన్నిబట్టి తర్జుమా చేస్తారు.

(ఈ పదములను కూడా చూడండి: దూత, అధికారము, క్రీస్తు, దెయ్యం, ప్రభువు, శక్తి, పాలకుడు, సాతాను, రక్షకుడు, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1, H117, H324, H2831, H3548, H4502, H5057, H5081, H5139, H5257, H5387, H5633, H5993, H6579, H7101, H7261, H7333, H7336, H7786, H7991, H8269, H8282, H8323, G747, G758, G1413, G2232, G3175