te_tw/bible/kt/savior.md

4.0 KiB

రక్షకుడు, కాపాడువాడు

వాస్తవాలు:

“కాపాడేవాడు” పదం ఇతరులను అపాయము నుండి కాపాడే వ్యక్తినీ లేదా రక్షించే వ్యక్తినీ సూచిస్తుంది. ఇతరులకు బలాన్ని ఇచ్చే వ్యక్తినీ లేదా వారికోసం సమకూర్చే వ్యక్తినీ కూడా సూచిస్తుంది.

  • పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు రక్షకునిగా సూచించబడ్డాడు ఎందుకంటే ఆయన తరచుగా వారి శత్రువులనుండి కాపాడాడు, వారికి బలాన్ని ఇచ్చాడు, వారు జీవించడానికి వారికి కావలసిన వాటన్నినిటినీ సమకూర్చాడు.
  • పాత నిబంధనలో ఇశ్రాయేలు మీదకు దండెత్తి వచ్చిన ఇతర ప్రజా గుంపులకు వ్యతిరేకంగా వారిని నడిపించడం ద్వారా ఇశ్రాయేలీయులను కాపాడడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఈ న్యాయాధిపతులు కొన్నిసార్లు "కాపాడేవారు" అని పిలువబడ్డారు. పాతనిబంధనలోని న్యాయాధిపతులు గ్రంథం చరిత్రలో ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను పాలించిన కాలాన్ని నమోదు చేసింది.
  • క్రొత్త నిబంధనలో “రక్షకుడు” పదం యేసు క్రీస్తుకు బిరుదుగాను లేదా ఒక వర్ణనగాను ఉపయోగించబడింది. ఎందుకంటే మనుష్యులు తమ పాపం విషయంలో శాశ్వత శిక్షను పొందకుండా వారిని ఆయన రక్షిస్తున్నాడు. వారి పాపం చేత వారు నియంత్రించబడకుండా కూడా వారిని కాపాడుతున్నాడు.

అనువాదం సూచనలు:

  • సాధ్యమైతే, “రక్షకుడు” పదం “రక్షించు,” “రక్షణ” అనే పదాలకు సంబంధించిన పదాలతో అనువదించబడవచ్చు.
  • ఈ పదం “రక్షించువాడు” లేదా “రక్షించు దేవుడు” లేదా “అపాయమునుండి విడిపించువాడు” లేదా “శత్రువులనుండి కాపాడువాడు” లేదా “పాపమునుండి (ప్రజలను) రక్షించు యేసు” అనే ఇతర విధాలుగా అనువదించబడ వచ్చు.

(చూడండి:deliver, Jesus, save, save)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3467, G4990