te_tw/bible/kt/jesus.md

9.7 KiB
Raw Permalink Blame History

యేసు, యేసు క్రీస్తు, క్రీస్తు యేసు

వాస్తవాలు:

యేసు దేవుని కుమారుడు. "యేసు" అంటే "యెహోవా రక్షించును." "క్రీస్తు" అనే పదం ఒక బిరుదు అంటే "అభిషేకించబడిన వాడు." దీనికి మరొక పదం మెస్సీయా.

  • రెండు పేర్లు తరచుగా "యేసు క్రీస్తు” లేదా “క్రీస్తు యేసు" గా కలిసిపోయి ఉంటాయి. ఈ రెండు పేర్లు దేవుని కుమారుడు మెస్సీయా అని నొక్కి చెపుతున్నాయి, ప్రజలు తమ పాపాల కోసం శిక్షించబడకుండా రక్షించడానికి ఆయన వచ్చాడు.
  • అద్భుత రీతిలో, పరిశుద్ధాత్మ శాశ్వతుడైన దేవుని కుమారుడు మానవుడుగా జన్మించేలా చేశాడు. దేవుని దూత యేసు అయన తల్లి ఆయనకు "యేసు" అని పేరు పెట్టాలని చెప్పాడు. ఎందుకంటే అయన తన ప్రజలను వారి పాపాలనుండి రక్షించడానికి దైవసంకల్పంతో ఉన్నాడు.
  • యేసు అనేక అద్భుతాలు చేశాడు, ఆయన దేవుడూ, క్రీస్తూ లేదా మెస్సీయా అని ఆయన బయలుపరచుకొన్నాడు.

అనువాదం సూచనలు:

  • అనేక భాషలలో "యేసు,” “క్రీస్తు" పదాలు మూల భాషలో ఉన్నపదాలకు సాధ్యమైనంతవరకూ దగ్గరగా ధ్వనించేలా లేదా అక్షరాలూ ఉండే విధానంలో పలుకబడ్డాయి. ఉదాహరణకు, "జెసుక్రిస్టో," జెజస్ క్రిస్థస్" "యేసుస్ క్రిస్తస్," "హెసుక్రిస్టో" పదాలు ఇతర భాషలలో వివిధ రీతులలో అనువదించబడిన పేరులు.
  • "క్రీస్తు," అనే పేరుకు కొందరు అనువాదకులు "మెస్సియా" పదంలోని కొంత రూపాన్ని అంతటా ఉపయోగించడానికి యెంచుకొన్నారు.
  • ఈ పేర్లు స్థానిక, జాతీయ భాషలలో ఏవిధంగా ఉచ్చరించబడాలో కూడా పరిశీలించండి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి: క్రీస్తుదేవుడుతండ్రి అయిన దేవుడుప్రధాన యాజకుడుదేవుని రాజ్యంమరియరక్షకుడు , దేవుని కుమారుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __22:4__దేవదూత చెప్పాడు, "నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు.” అయన పేరు యేసు ఆయనే మెస్సియా అవుతాడు."
  • 23:2"ఆయనకు యేసు (అంటే, 'యెహోవా రక్షించును') అని పేరు పెట్టు, ఎందుకంటే అయన ప్రజలను వారి పాపాలనుండి రక్షిస్తాడు."
  • __24:7__కాబట్టి యేసు ఎన్నడూ పాపం చేయకపోయినా యోహాను ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు.
  • 24:9 ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడడం యోహాను విన్నాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చినప్పుడు కుమారుడైన యేసునూ. పరిశుద్ధాత్మనూ చూచాడు.
  • 25:8

యేసు సాతాను శోధనలకు లొంగ లేదు. కాబట్టి సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.

తరువాత యేసు గలిలయ ప్రాంతం అంతటా సంచారం చేశాడు, పెద్ద జన సమూహం అయన దగ్గరకు వచ్చారు. వారు అనేక మంది రోగులను లేదా అవిటి వారిని, గుడ్డి వారిని, కుంటి, మూగ, చెవిటి వారిని తీసుకు వచ్చారు. యేసు వారిని స్వస్థపరిచాడు.

తరువాత యేసు ప్రార్థన ముగించి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఆయన నీటిపై నడుస్తూ సరస్సు మీద వారి పడవ దగ్గరకు వెళ్ళాడు!

  • __38:2__అతడు (యూదా) యూదు నాయకులు యేసు మెస్సియా అనే దానిని నిరాకరించారు మరియు వారు ఆయన చంపడానికి కుట్రపన్నుతున్నారని తెలుసుకొన్నాడు.
  • __40:8__తన మరణం ద్వారా మనుషులు దేవుని చెంత చేరడానికి యేసు ఒక మార్గాన్ని తెరచాడు.
  • __42:11__తరువాత యేసు పరలోకమునకు తీసుకొనిపబడ్డాడు, ఒక మేఘం ఆయనను వారికి కనబడకుండా చేసింది. అన్నిటిమీదా పరిపాలన చేయడానికి యేసు దేవుని కుడివైపున కూర్చొని ఉన్నాడు.
  • 50:17  యేసు మరియు ఆయన ప్రజలు నూతన భూమి మీద జీవిస్తారు, మరియు ఉనికిలో ఉండే సమస్తం మీదా ఆయన శాశ్వతకాలం రాజ్య పాలన చేస్తాడు. ఆయన ప్రతి కన్నీటి బిందువును తుడిచి వేస్తాడు. హింస, విచారం, ఏడ్పు, దుష్టత్వం, బాధ లేదా మరణం ఇక ఉండవు. యేసు తన రాజ్యాన్ని సమాధానంతోనూ, న్యాయంతోనూ రాజ్య పాలన చేస్తాడు. ఆయన తన ప్రజలతో శాశ్వతకాలం ఉంటాడు.

పదం సమాచారం:

  • Strongs: G24240, G55470