te_tw/bible/kt/save.md

10 KiB
Raw Permalink Blame History

రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ

నిర్వచనం:

“రక్షించు” పదం ఒకరు హానికరమైన దానిని లేదా చెడును అనుభవించకుండ కాపాడుటను సూచిస్తుంది. “సురక్షితంగా ఉండడం" అంటే అపాయం నుండి లేదా ప్రమాదం నుండి సంరక్షించబడుట అని అర్థం.

·         భౌతిక అర్థంలో ప్రజలు రక్షించబడతారు, లేదా హాని, ప్రమాదం లేదా మరణం కాపాడబడగలరు.

·         ఆత్మీయ అర్థంలో ఒక వ్యక్తి “రక్షణ" పొందియున్నట్లయితే సిలువలో మరణించిన యేసు ద్వారా దేవుడు అతనిని క్షమించియున్నాడనీ, తాను చేసిన పాపముల కొరకు నరకంలో శిక్షించబడడం నుండి తప్పించబడియున్నాడని అర్థం.

·         ప్రజలు అపాయమునుండి ప్రజలను రక్షించవచ్చు లేదా కాపాడవచ్చు, అయితే దేవుడు మాత్రమే ప్రజలు తమ పాపాల విషయంలో శాశ్వతంగా శిక్షించబడడం నుండి వారిని రక్షించగలడు.

·         “రక్షణ” పదం దుష్టత్వం లేదా ప్రమాదం నుండి రక్షించబడియుండడానినీ లేదా కాపాడబడియుండడానినీ సూచిస్తుంది.

·         బైబిలులో "రక్షణ" పదం సాధారణంగా తమ పాపముల విషయంలో పశ్చాత్తాపపడి యేసు నందు విశ్వాసం ఉంచినవారికి దేవుని చేత ఆత్మీయమైనా, శాశ్వతమైన విడుదల అనుగ్రహించబడడానిని సూచిస్తుంది.

·         దేవుడు తన ప్రజలను భౌతిక సంబంధమైన శత్రువులనుండి రక్షించడానినీ లేదా విడుదల చెయ్యడానినీ కూడా సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

·         “రక్షించు” పదం “విమోచించు” లేదా “హాని నుండి తప్పించు” లేదా “హానికరమైన విధానమునుండి తీసివేయడం" లేదా “చనిపోవడం నుండి కాపాడడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

·         “తన ప్రాణమును కాపాడుకొనువాడు" వాక్యంలో, “రక్షించు” పదం “భద్రపరచు” లేదా “సంరక్షించు” అని అనువదించబడవచ్చు.

·         “సురక్షిత" పదం “ప్రమాదం నుండి కాపాడబడడం” లేదా “ఎటువంటి హాని జరుగని స్థలంలో" అని అనువదించబడవచ్చు.

·         “రక్షణ" పదం "రక్షించు" లేదా "కాపాడు" పదాలకు సంబంధించిన పదాలను ఉపయోగించి అనువదించబడవచ్చు. "దేవుడు ప్రజలను రక్షించును (వారి పాపాల కోసం శిక్షించబడడం)" లేదా "దేవుడు తన ప్రజలను కాపాడుతాడు (వారి శత్రువుల నుండి)" వాక్యాలలో ఉన్నవిధంగా అనువదించవచ్చు.

·         “దేవుడే నా రక్షణ” వాక్యం “నన్ను రక్షించువాడు దేవుడే” అని అనువదించబడవచ్చు.

·         “నీవు రక్షణ బావులనుండి నీటిని తోడుకొంటావు" వాక్యం “దేవుడు నిన్ను కాపాడుచున్నందున నీటివలె నీవు అలసట తీర్చుకొంటావు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:cross, deliver, punish, sin, Savior)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణ:

  • __9:8__మోషే తన తోటివారైన ఇశ్రాయేలీయులను రక్షించడానికి ప్రయత్నించాడు.
  • __11:2__దేవుడు తనయందు విశ్వసించిన ప్రతి యొక్క తొలిచూలు బిడ్డను రక్షించడానికి దేవుడు ఒక మార్గమును అనుగ్రహించాడు.
  • 12:5 “భయపడకండి! ఈరోజున దేవుడు మీ కొరకు యుద్ధము చేయును, మిమ్మును రక్షించును” అని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
  • __12:13__దేవుడు ఐగుప్తు సైన్యమునుండి ఇశ్రాయేలీయులను రక్షించి నందున, వారు దేవునిని స్తుతించుటకునూ, వారికి దొరికిన నూతన స్వాతంత్యమును బట్టి వేడుక చేసుకోడానికీ అనేకమైన పాటలు పాడారు,
  • __16:17__ఇశ్రాయేలీయులు పాపము చేయడం, దేవుడు వారిని శిక్షించడం, వారు పశ్చాత్తాపపడడం, మరియు దేవుడు వారిని రక్షించుటకు వారియొద్దకు విమోచకుడిని పంపించడం ఈ విధంగా అనేకమార్లు జరిగింది.
  • 44:8“మీరు యేసును సిలువవేసియున్నారు, కాని దేవుడు ఆయనను తిరిగి సజీవునిగా చేసియున్నాడు. మీరు ఆయనను తిరస్కరించియున్నారు, కాని యేసు క్రీస్తు శక్తి ద్వారా తప్ప మరి ఏ మార్గాన రక్షణ పొందుటకు ఆవకాశము లేదు!”
  • __47:11__చెరసాల అధిపతి పౌలు సీల వద్దకు వణుకుతూ వచ్చి, “రక్షించబడుటకు నేను ఏమి చేయవలెను?” అని అడిగాడు. “ప్రభువైన యేసునందు విశ్వివాసం ఉంచుము, అప్పుడు నీవునూ, నీ కుటుంబమునూ రక్షించబడుదురు” అని పౌలు జవాబు చెప్పాడు.
  • __49:12__మచి క్రియలు మిమ్మును రక్షించనేరవు.
  • 49:13

యేసునందు విశ్వసించిన ప్రతి ఒక్కరినీ, ఆయనను తమ రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరినీ దేవుడు రక్షించును. అయితే ఆయనందు విశ్వసించని వారినెవరిని కూడా ఆయన రక్షించడు .

పదం సమాచారం:

  • Strongs: H0983, H2421, H2502, H3444, H3467, H3468, H4190, H4422, H4931, H5338, H6308, H6403, H7682, H7951, H7965, H8104, H8199, H8668, G08030, G08040, G08060, G12950, G15080, G49820, G49910, G49920, G51980