te_tw/bible/kt/sin.md

11 KiB
Raw Permalink Blame History

పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం

నిర్వచనం:

“పాపం” అనే పదం దేవుని చిత్తానికీ, ధర్మాలకూ విరుద్ధముగా చేసే చర్యలనూ, ఆలోచనలనూ, మాటలనూ సూచిస్తుంది. దేవుడు మనలను చేయమని కోరినదానిని చెయ్యకుండా ఉండడం అని కూడా ఈ పదం సూచిస్తుంది.

·         దేవునికి లోబడకుండా ఉండే పనులూ లేదా దేవుణ్ణి సంతోషపరచకుండా ఉంచే పనులు, ఇతర ప్రజలకు తెలియని విషయాలు సహితం ఏమైనా అవి పాపం అని పరిగణించబడతాయి

·         దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచనలూ, క్రియలూ “పాపభూయిష్టమైనవి.”

·         ఆదాము పాపము చేసినందున సమస్త మనుష్యులందరూ “పాప స్వభావంతో” పుట్టారు. ఆ స్వభావం వారిని నియంత్రించి, వారు పాపము చేయడానికి కారణం అవుతుంది.

·         “పాపి” అంటే పాపాలు చేసే వ్యక్తి అని అర్థం. అందుచేత ప్రతీ మనుష్యుడు పాపియైయున్నాడు.

·         కొన్నిమార్లు “పాపులు” అనే పదం ధర్మశాస్త్రమునకు లోబడని ప్రజలనూ, తాము భావించిన ప్రజలనూ సూచించడానికి పరిసయ్యుల వంటి మత సంబంధమైనవారి చేత ఉపయోగించబడింది.

·         “పాపి” అనే పదం ఇతర ప్రజలకంటే అతి హీనమైన ప్రజల కోసం కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకు, ఈ బిరుదు ఎక్కువగా సుంకం వసూలు చేసేవారికి, వ్యభిచారులకు ఇవ్వబడింది.

అనువాదం సూచనలు:

·         “పాపం” అనే పదం “దేవునికి అవిధేయత” లేదా “దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం" లేదా "దుష్ట ప్రవర్తన, దుష్ట తలంపులు" లేదా "చెడు క్రియలు" అని అనువదించబడవచ్చు.

·         “పాపం" పదం “దేవునికి అవిధేయత” లేదా “తప్పు చేయడం” అని కూడా అనువదించబడవచ్చు.

·         సందర్భాన్ని బట్టి, “పాపభూయిష్టమైన” అనే పదం “పూర్తిగా చెడు చెయ్యడం" లేదా "దుష్టత్వం" లేదా చేయుట” లేక “దుష్టత్వము” లేక “అనైతికత” లేక “చెడు” లేక “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం" అని అనువదించబడవచ్చు.

·         సందర్భాన్ని బట్టి “పాపి” అనే పదం “పాపములు చేయు వ్యక్తి” లేదా “తప్పులు చేయు వ్యక్తి” లేదా "దేవుని అవిధేయత చూపించే వ్యక్తి” లేదా “ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకొనే వ్యక్తి” అని అర్థం వచ్చే వాక్యాలతో గాని లేదా పదాలతోగానీ అనువదించబడవచ్చు.

·         “పాపులు” అనే పదం “అత్యంత పాపాత్ములైన ప్రజలు” లేదా “పాపాత్ములుగా పరిగణించబడిన ప్రజలు” లేదా “అనైతిక ప్రజలు” అనే అర్థం వచ్చే వాక్యాలతో గానీ లేదా పదాలతోగానీ అనువదించబడవచ్చు.

·         “సుంకం వసూలు చేసేవారు, పాపులు" అనే పదం అనువాదంలో “ప్రభుత్వం కోసం డబ్బును పోగుచేసేవారు, పాపాత్ములైన ఇతర ప్రజలు" లేదా అత్యంత పాపాత్ములైన ప్రజలు, సుంకం వసూలు చేసేవారు సహితం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

·         ఈ పదం అనువాదంలో పాప సంబంధమైన ప్రవర్తన, ఆలోచనలూ, ఇతర వ్యక్తులు చూడని, లేదా ఎరుగని సంగతులను గురించి కూడా తెలియచేసేవిధంగా ఉండేలా చూడండి.

·         “పాపం” అనే పదం సాధారణముగా ఉండాలి, "దుష్టత్వం," "చెడు” అనే పదాలకు భిన్నంగా ఉండాలి.

(చూడండి:disobey, evil, flesh, tax collector)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

·  3:15“ప్రజలు పాపపు క్రియలు చేయుటనుబట్టి నేను ఇక ఎన్నటికి నేలను శపించను, లేక ప్రజలు పాపాత్ములుగా ఉన్నప్పటికీ ప్రళయము చేత వారిని నాశనం చేయను అని వాగ్దానము చేయుచున్నాను” అని దేవుడు చెప్పాడు.

·  __13:12__వారు పాపము చేసినందున, దేవుడు వారి విషయమై చాలా కోపపడి, వారిని నాశనము చేయాలని ప్రణాళిక చేశాడు.

· __20:1__ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యములు దేవునికి విరుద్ధముగా పాపము చేసియున్నాయి. దేవుడు సీనాయి వద్ద ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను వారు ఉల్లంఘించారు.

·  __21:13__మెస్సీయ పరిపూర్ణుడైయుండును, ఆయనయందు ఎటువంటి పాపము ఉండదని ప్రవక్తలు కూడా చెప్పారు. ఆయన ప్రజల పాపాల కొరకై శిక్షను భరించడానికి చనిపోయాడు.

·  __35:1__ఒక రోజున యేసు అనేకమంది సుంకపు గుత్తదారులకు మరియు ఆయన బోధను వినడానికి వచ్చిన అనేకమంది పాపులకు బోధించుచుండెను.

· __38:5__యేసు గిన్నె ఎత్తికొని, “దీనిని త్రాగుడి. ఇది పాపముల నిమిత్తమై క్షమాపణ కొరకు చిందించబడే క్రొత్త నిబంధన సంబంధమైన నా రక్తమైయున్నది” అని చెప్పాడు.

· 43:11“మీలో ప్రతిఒక్కరు పశ్చాత్తాపపడి, యేసు నామమున బాప్తిస్మము పొందవలెను, తద్వారా దేవుడు మీ పాపములను క్షమించును” అని పేతురు వారికి జవాబిచ్చాడు.

·  __48:8__మన పాపముల కొరకు మనమందరము చనిపోవలసినవారమైయున్నాము!

· __49:17__మీరు క్రైస్తవులైనప్పటికి, మీరు పాపము చేయడానికి మీరు శోదించబడతారు. అయితే దేవుడు నమ్మదగినవాడు మరియు మీరు మీ పాపములను ఒప్పుకొనినట్లయితే, ఆయన మిమ్మును క్షమించును. మీరు పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన మీకు బలమును ఇచ్చును.

పదం సమాచారం:

  • Strongs: H0817, H0819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G02640, G02650, G02660, G02680, G03610, G37810, G39000, G42580