te_tw/bible/other/disobey.md

4.3 KiB
Raw Permalink Blame History

అవిధేయత చూపడం, అవిధేయత చూపిన, అవిధేయత, తిరుగుబాటు

నిర్వచనం:

"అవిధేయత చూపించడం" అంటే అధికారంలో ఉన్న వారు అజ్ఞాపించినప్పుడు లేదా హెచ్చరించినప్పుడు విధేయత చూపించకపోవడం.

·         చేయకూడదని తనకు చెప్పిన దానిని చేసిన వ్యక్తి అవిధేయత చూపిస్తున్నాడు.

·         అవిధేయత చూపించడం అంటే ఏదైనా చెయ్యమని అజ్ఞాపించినప్పుడు దానిని చెయ్యకుండా నిరాకరించడం అని కూడా అర్థం.

·         "అవిధేయుడు" పదం అలవాటుగా అవిధేయత చూపుతూ, తిరుగుబాటు స్వభావంతో ఉన్నవారిని వివరించడానికి కూడా ఉపయోగించబడుతుంది. అంటే వారు పాపంతోనూ లేదా దుష్టులుగానూ ఉన్నారు అని అర్థం.

·         "అవిధేయత" అంటే "లోబడకుండా ఉండే చర్య" లేదా “దేవుడు కోరిన దానికి వ్యతిరేకమైన ప్రవర్తన" అని అర్థం.

·         "అవిధేయులైన ప్రజలు" అనే పదం “ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉండే ప్రజలు" లేదా “దేవుడు ఆజ్ఞాపించిన దానిని చెయ్యని ప్రజలు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:authority, evil, sin, obey)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

· __2:11__దేవుడు మానవునితో ఇలా చెప్పాడు, "నీవు నీ భార్య మాట విని నాకు అవిదేయత చూపావు."

· 13:7 ప్రజలు ఈ ధర్మాలకు విధేయత చూపినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదిస్తానని, వారిని కాపాడతానని వాగ్దానం చేసాడు, వారు అవిధేయత చూపించినట్లయితే దేవుడు వారిని శిక్షిస్తాడు.

· __16:2__ఎదుకటే ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్న కారణంగా వారిని శిక్షించాడు, శత్రువులు వారిని ఓడించేలా అనుమతించాడు.

· 35:12 "పెద్ద కుమారుడు తన తండ్రితో ఇలా చెప్పాడు ఇన్ని సంవత్సరాలు నేను నీ కోసం నమ్మకంగా పని చేశాను! ఎన్నడూ అవిధేయత చూపలేదు, అయినప్పటికీ నా స్నేహితులతో విందు చేసుకునేందుకు నాకు ఒక ఒక చిన్న మేకనైనా ఇయ్యలేదు.'"

పదం సమాచారం:

  • Strongs: H4784, H5674, G05060, G05430, G05440, G05450, G38470, G38760