te_tw/bible/kt/cross.md

4.5 KiB
Raw Permalink Blame History

సిలువ

నిర్వచనం:

బైబిల్ కాలాల్లో, సిలువ అంటే నిలువు కొయ్యతో చేసిన గుంజ నేలలో పాటి అడ్డం కొయ్యతో చేసిన దూలాన్ని దానిపై అమరుస్తారు.

  • కాలంలో రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం నేరస్థులను సిలువకు కట్టి వేయడం లేక మేకులతో కొట్టి చనిపోయే వరకు ఉంచడం అనే శిక్ష విధించే వారు.
  • యేసుపై అయన చెయ్యని తప్పు నేరాలు మోపి రోమాప్రభుత్వం ఆయనకు సిలువ మరణ శిక్ష విధించింది.
  • గమనించండి. క్రాస్ అనే క్రియా పదానికి నది లేక సరస్సు వంటి దేన్నైనా దాటి అవతలికి పోవడం.

అనువాదం సూచనలు:

  • ఈ పదాన్ని లక్ష్య భాషలో సిలువ ఆకారం అనే అర్థం ఇచ్చే ఏ పదాన్ని అయినా ఉపయోగించి అనువదించ వచ్చు.
  • సిలువ అనే పదాన్ని మరి ఏదైనా మరణ శిక్ష విధించే “కొరత వేయడం” వంటి పరికరం పేరును ఉపయోగించి తర్జుమా చేయ వచ్చేమో చూడండి.
  • ఈ పదం బైబిల్ అనువాదంలో స్థానిక లేక జాతీయ భాషలో ఎలా అనువదించ వచ్చో చూడండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: [సిలువ వేయు] (../kt/crucify.md), Rome)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 40:01 తరువాత సైనికులు యేసును హేళన చేసి ఆయనను సిలువ వేయడానికి తీసుకుపోయారు. వారు ఆయన చనిపోనున్న సిలువను ఆయనచే సిలువ మోయించారు.
  • 40:02 సైనికులు యేసును “కపాలం” అనే చోటికి తీసుకుపోయారు. అయన చేతులు కాళ్ళు సిలువకు కొట్టారు.
  • 40:05 యూదు నాయకులు, గుంపులో ఇతరులు యేసును దూషించారు. వారు ఆయనతో ఇలా చెప్పారు "నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగి వచ్చి నిన్ను నీవు రక్షించుకో. ఆ తరువాత మేము నిన్ను విశ్వసించుతాము."
  • 49:10 సిలువపై యేసు చనిపోవడంలో అయన నీ శిక్ష తనపై వేసుకున్నాడు.
  • 49:12 యేసు దేవుని కుమారుడు అని నివు నమ్మాలి. అయన నీకు బదులుగా సిలువపై చనిపోయిన తరువాత దేవుడు ఆయన్ను మరలా బ్రతికించాడు.

పదం సమాచారం:

  • Strongs: G47160