te_tw/bible/kt/christ.md

7.3 KiB
Raw Permalink Blame History

క్రీస్తు, మెస్సీయా

వాస్తవాలు:

"మెస్సీయా” మరియు “క్రీస్తు" అంటే "అభిషేకించబడిన వాడు" అని అర్థం. ఇది దేవుని కుమారుడు యేసును సూచిస్తున్నాయి.

  • కొత్త నిబంధనలో "మెస్సీయా”, “క్రీస్తు" అనే రెండు పదాలూ దేవుని కుమారుణ్ణి సూచించడానికి ఉపయోగించబడ్డాయి. తన ప్రజలమీద రాజుగా పరిపాలన చేయడానికీ, మరియు వారిని పాపాల నుండీ, మరణం నుండీ రక్షించడానికీ తండ్రి అయిన దేవుడు ఆయనను నియమించాడు.
  • పాత నిబంధనలో, ఆయన భూమిమీదకు రావడానికి ముందు వందల సంవత్సరాల క్రితం మెస్సీయా గురించి ప్రవక్తలు ప్రవచనాలు రాశారు.
  • రానున్న మెస్సీయాను సూచించడానికి పాత నిబంధనలో తరచుగా "అభిషేకించబడిన (వాడు)" అనే అర్థం ఇచ్చే ఒక పదం ఉపయోగించబడింది.
  • యేసు ఈ ప్రవచనాలలో అనేకమైన వాటిని నెరవేర్చాడు మరియు తాను మెస్సీయా అని రుజువు చేసే అనేక అద్భుత కార్యాలు చేశాడు. అయన తిరిగి వచ్చినప్పుడు మిగిలిన ఈ ప్రవచనాలు నెరవేరుతాయి.
  • "క్రీస్తు" అనే పదం "క్రీస్తు” మరియు “క్రీస్తు యేసు” లో ఉన్నట్టుగా తరచూ ఒక బిరుదుగా ఉపయోగించబడింది.
  • "క్రీస్తు" పదం "యేసు క్రీస్తు" లో ఉన్నట్టుగా తన పేరులో భాగంగా ఉపయోగించబడింది.

అనువాదం సూచనలు:

  • ఈ పదం దాని అర్థాన్ని ఉపయోగించి అనువదించబడవచ్చు, "అభిషేకించబడిన వాడు” లేదా “దేవుని అభిషేకించబడిన రక్షకుడు."
  • అనేక భాషలు "క్రీస్తు" లేదా "మెస్సీయా" వలే కనిపించే లేదా ధ్వనించే ప్రతిలిఖిత పదాన్ని ఉపయోగించాయి. (చూడండి: తెలియనివాటిని ఏవిధంగా అనువదించాలి)
  • ప్రతిలిఖిత పదం తరువాత "క్రీస్తు, అభిషేకించబడినవాడు" లో ఉన్నట్టుగా పద నిర్వచనం ఉండవచ్చు.
  • బైబిలు అంతటిలోనూ ఈ పదం స్థిరంగా అనువదించబడేలా చూడండి, తద్వారా ఒకే పదం సూచించబడిందని స్పష్టం అవుతుంది.
  • "మెస్సీయా” మరియు “క్రీస్తు" అనే పదాల అనువాదాలు రెండు పదాలు ఒకే వచనంలో కనిపించే సందర్భాలలో సరిగా ఉండేలా చూసుకోండి. (యోహాను 1:41 లో ఉన్నవిధంగా).

(చూడండి:How to Translate Names)

(చూడండి:Son of God, David, Jesus, anoint)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 17:07 లోకంలో తన ప్రజలను పాపం నుండి రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న వాడు మెస్సీయా .
  • 17:08 ఇశ్రాయేలీయులు మెస్సీయా రావడానికి చాలా కాలం అంటే దాదాపు 1,000 సంవత్సరాలు ఎదురు చూడడం జరిగింది.
  • 21:01 ఆరంభం నుండి దేవుడు మెస్సీయాను పంపడానికి ప్రణాళిక చేసాడు.
  • 21:04 మెస్సీయా దావీదు స్వంత సంతానం అవుతాడని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు
  • 21:05 మెస్సీయా నూతన నిబంధనను ఆరంభిస్తాడు.
  • 21:06 మెస్సీయా ఒక ప్రవక్త, యాజకుడు, రాజు అవుతాడని దేవుని ప్రవక్తలు కూడా చెప్పారు.
  • 21:09 మెస్సీయా ఒక కన్యకు పుడతాడు అని ప్రవక్త యెషయా ప్రవచించాడు.
  • 43:07 అయితే "నీవు నీ పరిశుద్ధుని సమాధిలో కుళ్లుపట్టనియ్యవు" అని చెప్పిన ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ఆయనను సజీవునిగా లేపాడు."
  • 43:09 "అయితే దేవుడు యేసును ప్రభువుగానూ మరియు మెస్సీయా గానూ నియమించాడని నిశ్చయముగా తెలుసుకోండి!"
  • 43:11 పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడి యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి తద్వారా దేవుడు దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు."
  • 46:06 సౌలు యూదులతో వాదించాడు, యేసే మెస్సీయా అని రుజువు పరిచాడు.

పదం సమాచారం:

  • Strongs: H4899, G33230, G55470