5.7 KiB
5.7 KiB
దావీదు
వాస్తవాలు:
దావీదు ఇశ్రాయేలు రెండవ రాజు. అతడు దేవుణ్ణి ప్రేమించాడు, సేవించాడు. అతడు కీర్తనల ముఖ్య కవి.
- దావీదు యవ్వన ప్రాయంలోనే తన కుటుంబానికి చెందిన గొర్రెలను మేపుతున్న సమయంలో దేవునిచే ఎన్నిక చేయబడి ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.
- దావీదు గొప్ప యోధుడుగా ఇశ్రాయేలుసైన్యాన్ని శత్రువులకు వ్యతిరేకంగా నడిపించాడు. ఫిలిష్తియ వాడైన గొల్యాతు సంహారం ప్రసిద్ధి చెందింది.
- దావీదునుచంపడానికిసౌలు రాజు ప్రయత్నించాడు. అయితే దేవుడు అతణ్ణి కాపాడాడు. సౌలు మరణం తరువాత అతన్ని రాజుగా నియమించాడు.
- దావీదు ఒక భయంకర పాపం చేశాడు. అయితే అతడు పశ్చాత్తాప పడినందువల్ల దేవుడు అతన్ని క్షమించాడు.
- యేసు, మెస్సీయకు "దావీదు కుమారుడు" అని పేరు. ఎందుకంటే అతడు రాజైన దావీదు సంతతి వాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: గొల్యాతు, ఫిలిష్తీయులు, సౌలు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
- 1 సమూయేలు17:12-13
- 1 సమూయేలు 20:34
- 2 సమూయేలు 5:2
- 2 తిమోతి 2:8
- అపో.కా 2:25
- అపో.కా 13:22
- లూకా 1:32
- మార్కు 2:26
పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని ఉదాహరణలు:
- 17:02 దేవుడు బేత్లెహేము ఊరి వాడైన దావీదు అనే పేరు గల ఒక ఇశ్రాయేలు యువకుడిని సౌలు తరువాత రాజుగా నియమించడానికి ఎన్నుకొన్నాడు. దావీదు గొర్రెల కాపరి, వినయపూర్వకమైన నీతిపరుడైన మనిషి, దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడినవాడు.
- 17:03 దావీదు గొప్ప సైనికుడు, నాయకుడు కూడా. దావీదు యువకుడుగా ఉన్నప్పుడే అతడు గొల్యాతు అనే పేరుగల మహాకాయునితో పోరాడాడు.
- 17:04 దావీదు పట్ల మనుష్యులు చూపే ప్రేమకు సౌలు అసూయ చెందాడు. సౌలు అనేక సమయాలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు సౌలునుండి తప్పించుకుని పారిపోయాడు.
- 17:05 దేవుడు దావీదును దీవించి అతనికి విజయాలు ఇచ్చాడు. దావీదు అనేక యుద్ధాలు చేసి
దేవుని సహాయంతో ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించాడు.
- 17:06 ఇశ్రాయేలీయుల దైవారాధన కోసం, బలి అర్పణల కోసం దావీదు ఒక ఆలయం కట్టించాలనుకున్నాడు.
- 17:09 దావీదు అనేక సంవత్సరాలు న్యాయంగా నమ్మకత్వం కలిగి పరిపాలన చేశాడు. దేవుడు అతన్ని దీవించాడు. అయితే, తన జీవితం చివర్లో అతడు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేశాడు.
- 17:13 దావీదు చేసిన దానికి దేవుడు చాలా కోపగించుకున్నాడు. కాబట్టి ఆయన నాతాను ప్రవక్తను పంపి దావీదుకు అతడె దుష్టకరమైన పాపం చేశాడో చెప్పాడు. దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. తన తక్కిన జీవితమంతా దావీదు దుర్లభ సమయాలలో సైతం దేవునికి లోబడిఆయన్ను వెంబడించాడు.
పదం సమాచారం:
- Strong's: H1732, G11380