te_tw/bible/kt/anoint.md

4.8 KiB

అభిషేకించు, అభిషేకించిన, అభిషేకం

నిర్వచనము

"అభిషేకించు"అంటే ఒక వ్యక్తిపై లేక వస్తువుపై నూనె పోయడం లేక రుద్దడం. కొన్ని సార్లు నూనెతో సుగంధ ద్రవ్యాలు కలిపి దానికి తియ్యని, పరిమళ వాసన వచ్చేలా చేస్తారు. ఈ పదం పరిశుద్ధాత్మ ఎవరినైనా ఎన్నుకుని శక్తినివ్వడాన్ని సూచించడానికి అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు.

  • పాత నిబంధనలో, యాజకులు, రాజులు, ప్రవక్తలు నూనెతో అభిషిక్తులు అవుతారు. దేవునికి ప్రత్యేక సేవ కోసం నియమించడానికి ఇలా చేస్తారు.
  • బలిపీఠాలు, ప్రత్యక్ష గుడారం వంటి వస్తువులను కూడా నూనెతో అభిషేకించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించి మహిమ పరచడానికి వాటిని ఉపయోగిస్తారు.
  • కొత్త నిబంధనలో రోగులను వారి స్వస్థతకోసం నూనెతో అభిషేకిస్తారు.
  • కొత్త నిబంధనలో రెండు సార్లు పరిమళ నూనెతో ఒక స్త్రీ, ఆరాధన క్రియగా యేసును అభిషేకించడం చూస్తాము. ఒక సారి ఆమె తన భవిషత్తు భూస్థాపన కోసం ఇది చేసిందని యేసు వ్యాఖ్యానించాడు.
  • యేసు చనిపోయాక, అయన స్నేహితులు అయన శరీరాన్ని సమాధి కోసం నూనెలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
  • "మెస్సియా" (హీబ్రూ), "క్రీస్తు" (గ్రీకు) అనే బిరుదు నామాల అర్థం "అభిషిక్తుడు."
  • యేసు అనే మెస్సియా ప్రవక్తగా, ప్రధాన యాజకుడుగా, రాజుగా ఎన్నుకోబడి అభిషేకం పొందాడు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "అభిషేకించు"అనే ఈ పదాన్ని  "నూనె పోసి” లేక “నూనె రాసి” లేక “పరిమళ నూనె ప్రోక్షించి ప్రతిష్టించి."  అనువదించవచ్చు.
  • "అభిషేకించి"అనే దాన్ని,"నూనెతో ప్రతిష్టించి.” లేక “నియమించ బడిన” లేక “ప్రతిష్టించి." అని అనువదించవచ్చు.
  • కొన్ని సందర్భాల్లలో "అభిషేకించు"అనే పదాన్ని"నియమించు." అని అనువదించవచ్చు.
  • అభిషేకించబడిన యాజకుడు,"అనే దాన్ని  "నూనెతో ప్రతిష్టింపబడిన యాజకుడు” లేక “నూనె పోసి ప్రత్యేకించిబడిన  యాజకుడు."అని అనువదించవచ్చు.

(చూడండి: క్రీస్తు, consecrate, high priest, King of the Jews, priest, prophet)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం

  • Strong's: H0047, H0430, H1101, H1878, H3323, H4397, H4398, H4473, H4886, H4888, H4899, H5480, H8136, G00320, G02180, G07430, G14720, G20250, G34620, G55450, G55480