te_tw/bible/kt/highpriest.md

6.1 KiB
Raw Permalink Blame History

ప్రధాన యాజకుడు

నిర్వచనం:

"ప్రధాన యాజకుడు" అంటే ఇశ్రాయేలు యాజకుల నాయకుడుగా ఒక సంవత్సరం పటు నియమించ బడిన ప్రత్యేక యాజకుడు.

  • ప్రధాన యాజకునికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అతడు ఒక్కడే ఆలయం అతి పరిశుద్ధ భాగం లోకి ప్రత్యేక బలి అర్పణ కోసం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలడు.
  • ఇశ్రాయేలీయులకు అనేకమంది యాజకులున్నారు. అయితే ఒక సమయంలో ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటాడు.
  • యేసును బంధించినప్పుడు కయప అధికారిక ప్రధాన యాజకుడు. కయప మామ అన్న పేరుకూడా కొన్ని సార్లు ప్రస్తావించబడింది. ఎందుకంటే అతడు మొదటి ప్రధాన యాజకుడు, బహుశా ఇతనికి ప్రజలపై ఇంకా అదుపు, అధికారం ఉండవచ్చు.

అనువాదం సలహాలు:

  • "ప్రధాన యాజకుడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అధికారిక యాజకుడు” లేక “అత్యున్నత హోదాగల యాజకుడు."
  • ఈ పదాన్ని "ప్రధాన యాజకుడు" అని కాకుండా “ముఖ్య యాజకుడు” అని అనువదించేలా జాగ్రత్త పడండి.

(చూడండి: అన్న, కయప, ప్రధాన యాజకులు, యాజకుడు, ఆలయం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 13:08 తెరవెనుక గదిలోకి ప్రధాన యాజకుడు తప్ప ఎవరూ ప్రవేసించ రాదు. ఎందుకంటే దేవుడు అందులో నివసించాడు.
  • 21:07 రానున్న మెస్సియా పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు అయన దేవునికి పరిపూర్ణమైన బలి అర్పణ గావించాడు.
  • 38:03 ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదు నాయకులు యూదాకు ముఫ్ఫై వెండి నాణాలు ఇచ్చి యేసుకు ద్రోహం తలపెట్టాలని చెప్పారు.
  • 39:01 సైనికులు యేసును ప్రధాన యాజకునిఇంటికి తీసుకుపోయారు. అక్కడ అతడు ఆయన్ను ప్రశ్నించాలి.
  • 39:03 చివరకు ప్రధాన యాజకుడు యేసును సూటిగా చూస్తూ అడిగాడు. "నీవు మెస్సియావా, సజీవ దేవుని కుమారుడవా, చెప్పు?"
  • 44:07 మరుసటిరోజు, యూదు నాయకులు పేతురు, యోహానులను ప్రధాన యాజకుడు ఇతర మత నాయకుల దగ్గరికి తెచ్చారు.
  • 45:02 కాబట్టి మత నాయకులు స్తెఫనును బంధించి ప్రధాన యాజకుడు ఇతర యూదుల నాయకుల దగ్గరికి తెచ్చారు. కొందరు అబద్ధ సాక్షులు స్తెఫను గురించి సాక్ష్యం చెప్పారు.
  • 46:01 ప్రధాన యాజకుడు సౌలు దమస్కులోని క్రైస్తవులను బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి అనుమతి ఇచ్చాడు.
  • 48:06 యేసు గొప్ప ప్రధాన యాజకుడు. ఇతర యాజకులవలె కాక అయన తానే లోక ప్రజలందరి పాపాల కోసం ఏకైక బలి అర్పణగా తననే అర్పించుకున్నాడు. యేసు పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు ఎందుకంటే ఏ కాలంలో నైనా ఎవరైనా చేసిన ప్రతి పాపం తనపై వేసుకున్నాడు.

పదం సమాచారం:

  • Strongs: H7218, H1419, H3548, G07480, G07490