te_tw/bible/names/annas.md

2.1 KiB
Raw Permalink Blame History

అన్న

వాస్తవాలు:

క్రీ. శ. 6 నుడి15 వరకు దాదాపు10 సంవత్సరాలపాటు అన్న యెరూషలేములో యూదా ప్రధాన యాజకుడుగా పదవిలో ఉన్నాడు. రోమా ప్రభుత్వం అతణ్ణి ప్రధాన యాజకత్వం నుండి తొలగించినప్పటికీ అతడు యూదుల మధ్య ప్రభావం గల నాయకుడుగా కొనసాగాడు.

  • యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఉన్న ఈ అన్న అధికార ప్రధాన యాజకుడైన కయపకు మామగారు.
  • ప్రధాన యాజకులు పదవిలో లేనప్పటికీవారికి ప్రజలపై అధికారం,పదవీ బాధ్యతలుకొన్నిఉంటాయి.కాబట్టే క్రీస్తునుబంధించే సమయంలో కయప,ఇతరులు యాజకత్వంలోఉన్నప్పటికీ అన్న కూడా ప్రధానయాజకుడుగా ప్రస్తావించబడ్డాడు.
  • యూదా నాయకులు జరిగించు న్యాయ విమర్శలోప్రశ్నించడానికి యేసు క్రీస్తును మొదటిగా అన్న దగ్గరకు తీసుకు వచ్చారు.

తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా

చేయాలి

  • (ఈ పదములను కూడా చూడండి: ప్రధాన యాజకుడు, యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

  • అపొ. కా. 04:5-7
  • యోహాను 18:22-24
  • లూకా 03:1-2

పదం సమాచారం:

  • Strong's: G04520