9.1 KiB
9.1 KiB
ప్రవక్త, ప్రవచనం, భవిష్యత్తును చెప్పడం, దీర్ఘదర్శి, ప్రవక్త్రిని
నిర్వచనం:
“ప్రవక్త” అంటే ప్రజలకు దేవుని సందేశాన్ని చెప్పేవాడు. ఈ కార్యాన్ని చేసే స్త్రీని “ప్రవక్తిని” అని పిలుస్తారు.
- తరచుగా ప్రవక్తలు ప్రజలు తమ పాపములనుండి తిరిగి దేవునికి విధేయులు కావాలని హెచ్చరించారు.
- “ప్రవచనము” అంటే ప్రవక్త మాట్లాడే సందేశం అని అర్థం. “ప్రవచించడం” అంటే దేవుని సందేశాన్ని చెప్పడం అని అర్థం.
- తరచుగా ప్రవచన సందేశము భవిష్యత్తులో జరగబోవుదానిని గురించి ఉంటుంది.
- పాత నిబంధనలోనున్న అనేక ప్రవచనములు ఇప్పటికే నెరవేర్చబడియున్నాయి.
- బైబిలులో ప్రవక్తల చేత రాయబడిన అనేక గ్రంథాలు కొన్ని సార్లు "ప్రవక్తలు" అని సూచించబడతాయి.
- ఉదాహరణకు, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే ఈ మాట హెబ్రీ లేఖనములన్నిటిని సూచిస్తుంది, దీనిని “పాత నిబంధన” పిలుస్తాము.
- “దీర్ఘదర్శి” లేక “చూచే వ్యక్తీ” అనే పదం ప్రవక్త కోసం వాడబడింది.
- కొన్నిమార్లు “దీర్ఘదర్శి” పదం అబద్దపు ప్రవక్తను లేదా శకునము చెప్పే అభ్యాసాలను జరిగించేవాడిని సూచిస్తుంది.
అనువాదం సూచనలు:
- “ప్రవక్త” పదం “దేవుని ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి” లేదా “దేవుని సందేశములను మాట్లాడే వ్యక్తి” అని అనువదించబడవచ్చు.
- “దీర్ఘదర్శి” పదం “దర్శనములు చూసే వ్యక్తి” లేదా “దేవుని నుండి భవిష్యత్తును చూడగలిగే మనుష్యుడు” అని అనువదించవచ్చు.
- “ప్రవక్తినులు పదం “దేవునికి స్త్రీ ప్రతినిధి” లేదా “దేవుని కొరకు మాట్లాడే స్త్రీ” లేదా “దేవుని సందేశాలను మాట్లాడే స్త్రీ” అని అనువదించబడవచ్చు.
- “ప్రవచనము” పదం అనువాదంలో “దేవుని నుండి సందేశము” లేదా “ప్రవక్త సందేశము” అని ఉండవచ్చు.
- “ప్రవచించడం” పదం “దేవుని నుండి మాటలను పలుకడం” లేదా “దేవుని సందేశాన్ని చెప్పు" అని అనువదించబడవచ్చు.
- “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే అలంకారిక వాక్యము, “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల పుస్తకములు” లేదా “దేవుడు గురించీ, తన ప్రజలను గురించి వ్రాయబడిన ప్రతీది, ఇందులో ప్రవక్తలు బోధించినవి మరియు దేవుని కట్టడలు" ఉన్నాయి.
- అబద్ధపు దేవుని ప్రవక్తను (లేక దీర్ఘదర్శిని) సూచించేటప్పుడు, దీనిని “అబద్ధ ప్రవక్త (దీర్ఘదర్శి)” లేదా “అబద్దపు దేవుని ప్రవక్త (లేక దీర్ఘదర్శి)” లేదా “బయలు ప్రవక్త” అని తర్జుమా చేయవలసిన అవసరత ఉంటుంది.
(చూడండి: Baal, divination, false god, false prophet, fulfill, law, vision)
బైబిలు రిఫరెన్సులు:
- 1 Thessalonians 2:14-16
- Acts 3:25
- John 1:43-45
- Malachi 4:4-6
- Matthew 1:23
- Matthew 2:18
- Matthew 5:17
- Psalm 51:1
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- __12:12__ఐగుప్తీయులు చనిపోయారని ఇశ్రాయేలీయులు చూచినప్పుడు, వారు దేవునియందు విశ్వాసముంచిరి మరియు మోషే దేవుని ప్రవక్త అని విశ్వాసం ఉంచారు.
- __17:13__దావీదు చేసిన పనినిబట్టి దేవుడు కోపగించుకొనెను, ఇందుచేత దావీదు చేసిన పాపము ఎంత ఘోరమైనదని చెప్పుటకు దేవుడు నాతాను ప్రవక్తను దావీదునొద్దకు పంపించాడు.
- __19:1__ఇశ్రాయేలీయుల చరిత్రయందంతంటిలో దేవుడు వారియొద్దకు ప్రవక్తలను పంపెను. దేవుని నుండి వచ్చు సందేశములను ప్రవక్తలు విని, ఆ దేవుని సందేశములను వారు ప్రజలకు వినిపించారు.
- __19:6__ఇశ్రాయేలు రాజ్యము యొక్క సమస్త ప్రజలందరూ మరియు బయలు దేవతకు సంబంధించిన 450 మంది ప్రవక్తలు కర్మెలు పర్వతము వద్దకు వచ్చిరి.
- __19:17__అనేకసార్లు ప్రజలు దేవునికి విధేయత చూపలేదు. వారు అనేకమార్లు ప్రవక్తలను అగౌరపరచారు, మరియు కొన్నిమార్లు వారిని హతమార్చారు.
- __21:9__మెస్సయ్యా కన్య మరియ గర్భాన జన్మిస్తాడని ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు.
- 43:5“అంత్యదినములలో, నా ఆత్మను కుమ్మరించెదను” అని దేవుడు చెప్పిన మాటను యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడి, నెరవేర్చబడెను.
- 43:7“నీవు పరిశుద్ధుని సమాధిలో ఉండనివ్వవు” అని చెప్పబడిన ప్రవచనమును నెరవేర్చావు.
- __48:12__దేవుని వాక్యమును ప్రకటించిన మోషే గొప్ప ప్రవక్త. అయితే యేసు అందరిలో గొప్ప ప్రవక్త. ఆయనే దేవుని వాక్యమైయుండెను.
పదం సమాచారం:
- Strong’s: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G24950, G43940, G43950, G43960, G43970, G43980, G55780