te_tw/bible/kt/lawofmoses.md

8.1 KiB
Raw Permalink Blame History

ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం

నిర్వచనం

"ధర్మశాస్త్రం" పదం అనుసరించవలసిన నియమం లేదా హెచ్చరికను సూచిస్తుందని సరళంగా చెప్పవచ్చు. బైబిలులో "ధర్మశాస్త్రం" పదం తరచుగా దేవుడు తన ప్రజలు విధేయత చూపాలని లేదా చేయాలని కోరుకున్న సమస్తాన్ని, దేనినైనా సూచిస్తుంది. "మోషే ధర్మశాస్త్రం" అనే నిర్దిష్ట పదం ఇశ్రాయేలీయులు విధేయత చూపడం కోసం దేవుడు మోషే ఇచ్చిన ఆజ్ఞలు, హెచ్చరికలను సూచిస్తుంది.

  • సందర్భాన్ని బట్టి ధర్మశాస్త్రం ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
    • ఇశ్రాయేలీయుల కోసం దేవుడు రాతి పలకల మీద రాసిన పది ఆజ్ఞలు
    • మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ
    • పాత నిబంధనలోని మొదటి ఐదు గ్రంథాలు
    • tపాత నిబంధన అంతా (క్రొత్త నిబంధన లో లేఖనాలు అని పిలువబడింది)
    • దేవుని హెచ్చరికలు అన్నీ, ఆయన చిత్తం

అనువాదం సూచనలు:

  • ఈ పదాలను బహువచనంలో “ధర్మములు” అని అనువదించవచ్చు, ఎందుకంటే అవి అనేక హెచ్చరికలను సూచిస్తున్నాయి.
  • ”మోషే ధర్మశాస్త్రం పదం “ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి దేవుడు మోషేకు చెప్పిన ధర్మశాస్త్రం” అని అనువదించవచ్చు.* సందర్భాన్ని బట్టి “మోషే ధర్మశాస్త్రం” పదబంధం “దేవుడు మోషేకు చెప్పిన ధర్మం” లేదా "మోషేకు దేవుడు చెప్పిన ధర్మం" లేదా “ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి దేవుడు మోషేకు చెప్పిన ధర్మాలు” అని అనువదించబడవచ్చు.
  • ”ధర్మశాస్త్రం” లేదా ”దేవుని ధర్మం” లేదా “దేవుని ధర్మాలు” పదాల అనువాదంలో “దేవుని నుండి ఆజ్ఞలు” లేదా "దేవుని ఆజ్ఞలు" లేదా "దేవుడు ఇచ్చిన చట్టాలు" లేదా “దేవుని ఆజ్ఞాపించే ప్రతీది" లేదా "దేవుడు హెచ్చరించే ప్రతీది" అని ఇతర పదాలు ఉండవచ్చు.
  • "యెహోవా ధర్మం" పదబంధం "యెహోవా చట్టాలు" లేదా "లోబడాలని యెహోవా చెప్పిన చట్టాలు" లేదా "యెహోవా నుండి చట్టాలు" లేదా "యెహోవా ఆజ్ఞాపించిన సంగతులు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:instruct, Moses, Ten Commandments, lawful, Yahweh)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • __13:7__దేవుడు అనేక ఇతర ధర్మాలను, నియమాలను కూడా అనుసరించడానికి ఇచ్చాడు. ఈ ధర్మాలకు ప్రజలు లోబడినట్లయితే, వారిని ఆశీర్వదిస్తాననీ, వారిని కాపాడుతాననీ దేవుడు వాగ్దానం చేసాడు. వాటికి వారు అవిధేయత చూపినట్లయితే దేవుడు వారిని శిక్షిస్తాడు.
  • __13:9__ఎవరైనా దేవుని ధర్మాన్ని అతిక్రమించినప్పుడు దేవునికి ఒక బలిగా అందరూ కలుసుకొనే ప్రత్యక్ష గుడారము ఎదుటికి ఒక జంతువును తీసుకొని రావచ్చు.
  • __15:13__సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధనకు లోబడాలనే షరతును యెహోషువా ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ధర్మాల విషయంలో నమ్మకంగా ఉండి వాటికి లోబడతామని ప్రజలు వాగ్దానం చేసారు.
  • __16:1__యెహోషువా చనిపోయిన తరువాత, ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించారు. మిగిలిన కనానీయులను బయటికి తరిమివేయలేదు లేదా దేవుని ధర్మాలకు లోబడలేదు.
  • __21:5__నూతన నిబంధనలో, దేవుడు తన ధర్మాన్ని ప్రజల హృదయాలలో రాస్తాడు, మనుష్యులు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొంటారు, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు వారి పాపాల్ని క్షమిస్తాడు.
  • __27:1__ప్రభువైన యేసు ఇలా జవాబిచ్చాడు, “దేవుని ధర్మశాస్త్రం లో ఏమి రాసి ఉంది?
  • __28:1__యేసు అతనితో, “నన్ను ‘మంచివాడవని’ ఎందుకు పిలుస్తున్నావు? అని అడిగాడు. దేవుడు తప్ప మంచి వాడొక్కడూ లేదు. అయితే నీకు నిత్యజీవం కావాలంటే దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలి.”

పదం సమాచారం:

  • Strongs: H0430, H1881, H1882, H2706, H2710, H3068, H4687, H4872, H4941, H8451, G23160, G35510, G35650