te_tw/bible/other/tencommandments.md

3.4 KiB

పది ఆజ్ఞలు

వాస్తవాలు:

"పది ఆజ్ఞలు" అంటే దేవుడు సీనాయి కొండపై మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇశ్రాయేలీయులు కనాను ప్రదేశం ప్రయాణంలో ఎడారిలో ఉండగా వారికి ఇచ్చాడు. దేవుడు ఈ ఆజ్ఞలను రెండు పెద్ద రాతి పలకలపై రాశాడు.

  • దేవుడు ఇశ్రాయేలీయులకు అనేక ఆజ్ఞలు ఇచ్చి వాటికి లోబడమని చెప్పాడు. అయితే పది ఆజ్ఞలు మాత్రం ప్రత్యేక ఆజ్ఞలు. అవి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రేమించి ఆరాధన చేసేలా ఇంకా ఇతర ఇతర ప్రజల పట్ల ప్రేమ చూపేలా చేస్తాయి.
  • ఈ ఆజ్ఞలు తన ప్రజలతో దేవుని నిబంధన సంబంధమైనవి. దేవుడు అజ్ఞాపించిన డానికి లోబడడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుణ్ణి ప్రేమించామని, తాము ఆయనకు చెందిన వారమని కనపరచుకుంటున్నారు.
  • పది ఆజ్ఞల రాతి పలకలను నిబంధన మందసంలో ఉంచారు. అది ప్రత్యక్ష గుడారంలో తరువాత ఆలయం అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు.

(చూడండి: నిబంధన మందసం, ఆజ్ఞ, నిబంధన, ఎడారి, చట్టం, లోబడు, సీనాయి, ఆరాధన)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 13:07 తరువాత దేవుడు ఈ పది ఆజ్ఞలను రెండు రాతి పలకలపై రాశాడు. వాటిని మోషేకు ఇచ్చాడు.
  • 13:13 మోషే కొండ దిగి వచ్చి ఆ విగ్రహం చూసి చాలా కోపగించుకున్నాడు. దేవుడు ఇచ్చిన పది పది ఆజ్ఞలు రాసి ఉన్న రాళ్లు కింద పడేసి పగలగొట్టాడు.
  • 13:15 మోషే తాను పగలగొట్టిన పలకల స్థానంలో పది ఆజ్ఞలు కొత్తరాతి పలకలపై రాశాడు.

పదం సమాచారం:

  • Strong's: H1697, H6235