te_tw/bible/kt/worship.md

5.9 KiB
Raw Permalink Blame History

ఆరాధన

నిర్వచనము:

“ఆరాధన” అనే పదానికి ఒకరిని లేక విశేషముగా దేవునిని ఘనపరచడం, స్తుతించడం, మరియు ఆయనకు లోబడియుండడం అని అర్థము.

  • ఈ పదానికి అనేకమార్లు ఒక వ్యక్తి తననుతాను తగ్గించుకొని ఇంకొక వ్యక్తిని ఘనపర్చుట కొరకు “సాగిలపడడం” లేక “ఒకరు తననుతాను లోబడియుండడం” అనే అర్థము కూడా ఉంటుంది.
  • మనము దేవునిని గౌరవించి, సేవించి, స్తుతించి మరియు ఆయనకు లోబడియున్నప్పుడు మనము ఆయనను ఆరాధించుచున్నాము.
  • ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించినప్పుడు, ఆ ఆరాధనలో వారు దహనబలిపీఠం మీద ప్రాణులను బలి ఇచ్చేవారు.
  • కొంతమంది ప్రజలు తప్పుడు దేవుళ్ళను ఆరాధించేవారు.

తర్జుమా సలహాలు:

  • “ఆరాధన” అనే ఈ పదమును “క్రిందకి వంగడం” లేక “ఘనపరచి, సేవించడం” లేక “గౌరవించి విధేయత చూపడం” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • కొన్ని సందర్భాలలో “తగ్గించుకొని స్తుతించుట” లేక “ఘనత మరియు స్తుతులను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి:bow, fear, sacrifice, praise, honor)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:04 ఆ తరువాత దేవుడు వారికి నిబంధన ఇచ్చెను, మరియు “నేను ఐగుప్తునుండి మిమ్మును రక్షించిన మీ దేవుడైన యెహోవాను. ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు” అని చెప్పెను.
  • 14:02 కనానీయులు దేవునికి లోబడలేదు లేక ఆయనను ఆరాధించలేదు. వారు తప్పుడు దేవుళ్ళను ఆరాధించిరి మరియు అనేక చెడ్డ కార్యములను చేసిరి.
  • 17:06 ఇశ్రాయేలీయులందరూ దేవునిని ఆరాధించుటకు మరియు ఆయనకు బలులు అర్పించుటకు ఒక మందిరమును కట్టాలని దావీదు కాంక్షించెను.
  • 18:12 రాజులందరూ మరియు ఇశ్రాయేలులోని ఎక్కువ శాతపు ప్రజలు విగ్రహములను ఆరాధించిరి.
  • 25:07 “సాతానా నానుండి వెళ్ళిపో! దేవుని వాక్యములో ఆయన తన ప్రజలకు, ‘మీ దేవుడైన యెహోవాను మాత్రమె ఆరాధించాలి మరియు ఆయనను మాత్రమె సేవించాలి అని ఆదేశించియున్నాడు” అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను.
  • 26:02 సబ్బాతు రోజున, ఆయన (యేసు)ఆరాధన స్థలమునకు వెళ్ళెను.
  • 47:01 అక్కడ వ్యాపారియైన లూదియా అనే ఒక స్త్రీని వారు కలిసికొనిరి. ఆమె దేవునిని ప్రేమించి, ఆయనను ఆరాధించే స్త్రీ అయ్యుండెను.
  • 49:18 ఇతర క్రైస్తవులతో దేవునిని ఆరాధించాలని, ఆయన వాక్యమును ధ్యానించాలని, ఆయనకు ప్రార్థన చేయాలని మరియు మీకు ఆయన చేసిన కార్యములను ఇతరులకు చెప్పాలని దేవుడు మీకు చెప్పుచున్నాడు.

పదం సమాచారం:

  • Strongs: H5457, H5647, H6087, H7812, G13910, G14790, G21510, G23180, G23230, G23560, G30000, G35110, G43520, G43530, G45730, G45740, G45760