te_tw/bible/other/sacrifice.md

8.8 KiB
Raw Permalink Blame History

బలి, బలులు, అర్పణ

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో “బలియాగము” మరియు “అర్పణ” అనే ఈ రెండు పదములు దేవునిని ఆరాధన చేయు క్రియగా దేవునికి ఇచ్చే ప్రత్యేకమైన బహుమానములను సూచించును. ప్రజలు కూడా అనేక అబద్దపు దేవుళ్ళకు అర్పణలను అర్పించెదరు.

బలి

  • దేవునికి చేసే బలులు తరచుగా జంతువును చంపడం ఉంటుంది
  • దేవుని పరిపూర్ణ పాపరహిత కుమారుడైన యేసు బలి ఒక్కటి మాత్రమే ప్రజలను పాపం నుండి పూర్తిగా శుద్ధి చేయగలదు; జంతు బలులు ఎప్పటికీ చేయలేవు.

అర్పణ

  • “అర్పించడం” అనే పదం సాధారణంగా అందించే లేదా ఇవ్వబడిన దేనినైనా సూచిస్తుంది. "బలి" అనే పదం ఇచ్చే వ్యక్తికి చాలా ఖర్చుతో ఇవ్వబడిన లేదా చేసిన దానిని సూచిస్తుంది.
  • దేవునికి అర్పణలు ఇశ్రాయేలీయులకు భక్తిని మరియు విధేయతను తెలియజేయడానికి ఇవ్వమని ఆయన ఆజ్ఞాపించాడు.
  • “దహనబలి” మరియు “శాంతిబలి” వంటి వివిధ అర్పణల పేర్లు ఎలాంటి అర్పణ ఇవ్వబడుతున్నాయో సూచిస్తున్నాయి.

అనువాదం సూచనలు:

  • “అర్పించుట” అనే ఈ పదమును “దేవునికి ఇచ్చే కానుక” అని లేక “దేవునికి ఇవ్వబడిన ఏదైనా” లేక “దేవునికి సమర్పించిన ఏదైనా విలువైనది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్బానుసారముగా, “బలియాగము” అనే ఈ మాట “ఆరాధనలో ఇచ్చే విలువైనది” లేక “ఒక ప్రత్యేకమైన జీవిని బలి అర్పించి, దేవునికి సమర్పించేది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “బలియాగమునకు” క్రియను “విలువైనదానిని సమర్పించుకొనుట” లేక “ఒక ప్రాణిని బలియిచ్చి, దానిని దేవునికి అర్పించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సజీవయాగముగా నిన్ను నీవు సమర్పించుకొనుట” అనే ఈ మాటను అనువాదము చేయు వేరొక విధానములో “నీ జీవితమును జీవించుచున్నప్పుడు, బలిపీఠము మీద అర్పించబడిన ప్రాణివలె (లేక జంతువువలె) దేవునికి నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకొనుము.

(ఈ పదములను కూడా చూడండి: altar, burnt offering, drink offering, false god, fellowship offering, freewill offering, peace offering, priest, sin offering, worship)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 3:14 నోవహు నావనుండి దిగిన తరువాత, ఆయన ఒక దహన బలిపీఠమును కట్టి, బలియాగమునకు అర్పించుటకు ఉపయోగించే ప్రతియొక్క ప్రాణిని అర్పించెను. దేవుడు బలియాగముతో చాలా సంతోషముగా ఉండెను మరియు నోవహును, అతని కుటుంబమును ఆశీర్వదించెను.
  • 5:6 “నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇసాకును తీసుకొని, అతనిని నాకు బలియాగముగా సమర్పించుము.” మరలా అబ్రాహాము దేవునికి విధేయత చూపెను మరియు తన కుమారుని బలి ఇచ్చుటకు సిద్ధపడెను.
  • __5:9__ఇస్సాకుకు బదులుగా బలియిచ్చుటకు దేవుడు ఒక గొర్రెను అనుగ్రహించెను.
  • __13:9__దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపే వారందరూ దేవునికి బలియర్పణగా ప్రత్యక్షపు గుడారపు ద్వారము వద్దకు ఒక ప్రాణిని తీసుకొని రావలెయును. యాజకుడు ఆ ప్రాణిని వధించి, దహన బలిపీఠము మీద కాల్చివేయును. బలియర్పించబడిన ప్రాణి యొక్క రక్తము బలియిచ్చిన వ్యక్తియొక్క పాపమును కప్పును మరియు దేవుని దృష్టిలో ఆ వ్యక్తిని కడిగివేయును.
  • __17:6__ఇశ్రాయేలీయులదరూ దేవునిని ఆరాధించి, ఆయనకు బలులు అర్పించుటకు అనువుగా ఉండుటకు మందిరమును కట్టాలని దావీదు కాంక్షించెను.
  • __48:6__యేసు ప్రధాన యాజకుడైయున్నాడు. ఇతర యాజకులవలె కాకుండా, ఈయన తన్ను తాను బలిగా అర్పించుకొనెను, తద్వారా లోకములోని సకల ప్రజల పాపములను తీసివేయును.
  • __48:8__మన స్థానములో చనిపోవుటకు బలిగా దేవుని గొర్రెపిల్లయైన యేసును దేవుడు అనుగ్రహించియున్నాడు.
  • __49:11__ఎదుకటే యేసు తన్నుతాను అర్పించుకొనెను , దేవుడు ఎటువంటి పాపమునైనా, ఎటువంటి ఘోర పాపములనైనా క్షమించును.

పదం సమాచారం:

  • Strongs: H0801, H0817, H0819, H1685, H1890, H1974, H2076, H2077, H2281, H2282, H2398, H2401, H2402, H2403, H2409, H3632, H4394, H4503, H4504, H5066, H5068, H5071, H5257, H5258, H5261, H5262, H5927, H5928, H5930, H6453, H6944, H6999, H7133, H7311, H8002, H8426, H8548, H8573, H8641, G02660, G03340, G10490, G14350, G14940, G23780, G23800, G36460, G43760, G54850