te_tw/bible/kt/falsegod.md

8.0 KiB

దేవుడు, అబద్దపు దేవుడు, విగ్రహం, విగ్రహారాధన చేయువాడు, విగ్రహారాధన

నిర్వచనము

నిజ దేవునికి బదులుగా అబద్ధ దేవుడు దేన్నైనా ప్రజలు పూజించడం. "దేవత" అంటే అబద్ద స్త్రీ వేలుపు.

  • ఈ అబద్ధ దేవుళ్ళు లేక దేవతలు నిజంగా ఉనికిలో లేరు. యెహోవా ఒక్కడే దేవుడు.
  • ప్రజలు కొన్ని సార్లు పూజ చేయడం కోసం వారి అబద్ద దేవుళ్ళకు సంకేతాలుగా విగ్రహాలను తయారు చేసుకుంటారు.
  • బైబిల్లో, దేవుని ప్రజలు తరచుగా దేవునికి లోబడకుండా తొలగి పోయి అబద్ద దేవుళ్ళను పూజించారు.
  • దయ్యాలు తరచుగా ప్రజలు అబద్ధ దేవుళ్ళను విగ్రహాలను నమ్మేలా మోసగిస్తూ వాటిని పూజించినందువల్ల వారికి శక్తి లభిస్తుందని నమ్మిస్తాయి.
  • బైబిల్ కాలాల్లో ప్రజలు పూజించిన అనేక అబద్ధ దేవుళ్ళలో బయలు, దాగాను మరియి మోలెకు అనే ముగ్గురు దేవత్తలు అబద్ద దేవుళ్ళు. .
  • అషేరా, అర్తెమి (డయానా) ప్రాచీన ప్రజలు ఆరాధించిన ఇద్దరు స్త్రీ దేవతలు.

విగ్రహం అనేది ప్రజలు పూజించడం కోసం తయారు చేసుకున్న బొమ్మ. అది  ఒక నిజ  దేవుణ్ణి కాక ఇతరమైన దేనికైనా ఆరాధన చేయడాన్ని “విగ్రహారాధ్యులు” అంటారు.

  • ప్రజలు వారు అబద్ధ దేవుళ్ళను పూజించడానికి విగ్రహాలు పెట్టుకుంటారు.
  • ఈ అబద్ధ దేవుళ్ళు నిజంగా లేరు. యెహోవా తప్ప వేరే దేవుడు లేడు.
  • కొన్ని సార్లు దయ్యాలు విగ్రహాల ద్వారా పని చేస్తారు, ఏమీ లేకపోయినా వాటికీ శక్తి ఉన్నదని భ్రమింపజేస్తాయి.
  • విగ్రహాలను తరచుగా బంగారం, వెండి, కంచు, లేక ఖరీదైన కలప మొదలైన విలువైన ముడి సరుకుతో చేస్తారు.
  • "విగ్రహారాధ్య  రాజ్యం" అంటే "విగ్రహారాధన చేసే ప్రజలు" లేక "భూసంబంధమైన వస్తువులను పూజించే మనుషులు ఉన్న రాజ్యం."
  • "విగ్రహారాధ్య  ప్రతిమ" అనేది "చెక్కిన ప్రతిమ" లేక "విగ్రహం" అనే దానికి మరొకపదం.

అనువాదం సూచనలు

  • మీ భాషలో లేక సమీప భాషల్లో ఇప్పటికే "దేవుడు” లేక “అబద్ధ దేవుడు" అనే వాటికీ సరైన పదం ఉండ వచ్చు.
  • "విగ్రహం" అనే మాటను అబద్ద దేవుళ్ళను సూచించడానికి ఉపయోగిస్తారు.
  • ఇంగ్లీషులో చిన్న అక్షరం "g" ని అబద్ద దేవుళ్ళకోసం ఉపయోగిస్తారు, పెద్ద అక్షరం "G" ని ఏకైక నిజ దేవుని కోసం ఉపయోగిస్తారు. మరి కొన్ని ఇతర భాషల్లో కూడా అలా ఉంది.
  • అబద్ద దేవుళ్ళ కోసం పూర్తిగా వేరైన పదాన్ని వినియోగించడం.ఒక పద్దతి.
  • కొన్ని భాషల్లో మగ, లేక అడ అబద్ధ దేవుడి గురించి చెప్పడానికి పూర్తిగా వేరే పదాన్ని చేర్చవచ్చు.

(చూడండి:God, Asherah, Baal, Molech, demon, image, kingdom, worship)

బైబిల్ రిఫరెన్సులు

బైబిల్ కథల నుండి ఉదాహరణలు

*__10:2__ఈ తెగగుళ్ళ, ద్వారా దేవుడు ఫరోకు తాను ఫరో కన్నా మరియు ఐగుప్తు  దేవుళ్ళు అందరికన్నా ఎక్కువ శక్తిమంతుడని చూపించాడు.  .

  • 13:4 తరువాత దేవుడు వారితో ఒక నిబంధన చేసి ఇలా చెప్పాడు. "నేను నీ దేవుడైన యెహోవాను  నిన్ను ఐగుప్టు బానిసత్వం నుండి విడిపించాను.  ఇతర దేవుళ్ళను పూజించ వద్దు."
  • __14:2__వారు (కనానీయులు) అనేక మంది అబద్ధ దేవుళ్ళను పూజించారు అనేక చెడ్డ పనులను చేసారు.
  • __16:1__ఇశ్రాయేలీయులు నిజ దేవుడు యెహోవాకు బదులుగా కనానీయ దేవుళ్ళను పూజించ సాగారు.
  • __18:13__అయితే ఎక్కువ మంది యూదా రాజులు దుష్టత్వం, చెడు తనం మూలంగా విగ్రహాలను ఆరాధించారు. కొందరు రాజులు అయితే వారి పిల్లలను సైతం అబద్ధ దేవుళ్ళకు బలి ఇచ్చారు.

పదం సమాచారం

  • Strong's: H0205, H0367, H0410, H0426, H0430, H0457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G14930, G14940, G14950, G14960, G14970, G22990, G27120