te_tw/bible/other/kingdom.md

7.3 KiB
Raw Permalink Blame History

రాజ్యము, రాజ్యాలు

నిర్వచనం:

రాజ్యం అంటే ఒక రాజు చేత పరిపాలించ బడుతున్న ప్రజల గుంపు. ఈ పదమ ఒక రాజు లేక ఇతర పాలకుడు తన నియంత్రణ, అధికారం కలిగిన రాజకీయ ప్రాంతాలు లేక పరిధిని కూడా సూచిస్తుంది.

  • ఒక రాజ్యం భౌగోళికంగా ఎటువంటి పరిమాణంలోనైనా ఉండవచ్చు. ఒక రాజు ఒక రాజ్యాన్ని గాని, దేశాన్ని గాని లేక కేవలం ఒక పట్టణాన్ని గాని పరిపాలిస్తూ ఉండవచ్చు.
  • ”రాజ్యం” అనే పదం “దేవుని రాజ్యం” అనే పదంలో ఉన్నవిధంగా ఆత్మ సంబంధమైన పాలనను లేక అధికారాన్ని సూచించవచ్చు,
  • దేవుడు సమస్త సృష్టికి పాలకుడు, అయితే “దేవుని రాజ్యం” అనే పదం ప్రత్యేకించి యేసునందు విశ్వాసముంచి, ఆయన అధికారానికి లోబడిన ప్రజల మీద ఆయన ఏలుబడి, అధికారాన్ని సూచిస్తుంది.
  • సాతాను కూడా ఒక రాజ్యాన్ని కలిగి యున్నాడని బైబిలు చెపుతుంది, దీనిలో వాడు తాత్కాలికంగా అనేకమైనవాటి మీద పరిపాలన చేస్తాడు. వాడి రాజ్యం దుష్టమైనది, అది “చీకటి” అని సూచించబడింది.

అనువాదం సూచనలు:

  • ఒక రాజ్య పాలిస్తున్న భౌతిక ప్రాంతాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు “రాజ్యం” అనే పదాన్ని “(రాజు చేత పాలించబడుతున్న) దేశం” లేక “రాజు రాజ్యం” లేక “ఒక రాజు చేత పాలించబడుతున్న ప్రాంతం” అని అనువదించవచ్చు.
  • ఆత్మీయభావంలో, “రాజ్యం” అనే పదం “ప్రభుత్వము చెయ్యడం” లేక “ఏలుబడి చెయ్యడం” లేక “ఆధీనంలో ఉంచుకోవడం” లేక
  • ”యాజకుల రాజ్యం” అనే పదాన్ని “దేవుడు ప్రభుత్వం చేస్తున్న ఆత్మీయ యాజకులు” అని అనువదించవచ్చు.
  • ”వెలుగు రాజ్యం” అనే పదాన్ని “దేవుని ఏలుబడి వెలుగు వలే మంచిది” అని లేక “వెలుగు అయిన దేవుడు ప్రజలను పాలిస్తున్నప్పుడు” అని అనువదించవచ్చు ఈ భావంలో “వెలుగు” అనే పదం ఉంచడం సరియైనదే. ఎందుకంటే ఈ పదం బైబిలులో చాలా ప్రాముఖ్యమైన పదం.
  • ”రాజ్యం” అనే పదం సామ్రాజ్యం అనే పదానికి భిన్నమైనది, దీనిలో చక్రవర్తి అనేక దేశాల మీద ప్రభుత్వం చేస్తాడు.

(చూడండి:authority, king, kingdom of God, kingdom of Israel, Judah, Judah, priest)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 13:02 దేవుడు మోషేతోనూ, ఇశ్రాయేలీయులతోనూ ఇట్లనెను, “మీరు నాకు లోబడి నా ఆజ్ఞలు గైకొనిన యెడల మీరు నాకు ప్రతిష్టిత జనమై యుందురు, ఒక యాజకుల రాజ్యం గానూ, పరిశుద్ధ జనముగాను ఉందురు.
  • 18:04 దేవుడు సోలోమోను విషయంలో కోపంగా ఉన్నాడు, సోలోమోను అపనమ్మకత్వానికి శిక్షగా సోలోమోను మరణం తరువాత ఇశ్రాయేలు దేశం రెండు రాజ్యాలు గా విడిపోతుందని వాగ్దానం చేసాడు.
  • 18:07 ఇశ్రాయేలు దేశంలోని పది గోత్రములు రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. కేవలం రెండు గోత్రములు మాత్రమే అతనికి నమ్మకంగా ఉన్నాయి. ఈ రెండు గోత్రములు యూదా రాజ్యము గా మారాయి.
  • 18:08 ఇశ్రాయేలులోని ఇతర పది గోత్రములు రెహబాముకు వ్యతిరేకంగా తిరిగుబాటు చేసి యరోబాము అను పేరు కలిగిన వ్యక్తిని తమకు రాజుగా నియమించుకొన్నాయి. వారు తమ రాజ్యాన్ని ఉత్తర ప్రాంతంలో ఏర్పాటు చేసుకొన్నారు, దానిని ఇశ్రాయేలు _రాజ్య_అని పిలిచారు.
  • 21:08 రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించువాడు, ప్రజలకు తీర్పు తీర్చువాడు.

పదం సమాచారం:

  • Strongs: H4410, H4437, H4438, H4467, H4468, H4474, H4475, G09320