te_tw/bible/other/king.md

4.9 KiB
Raw Permalink Blame History

రాజు, రాచరికం

నిర్వచనం:

బైబిల్లో, "రాజు" అనే పదం ఒక నిర్దిష్ట వ్యక్తుల సమూహం లేదా ఒక నిర్దిష్ట భూమి (లేదా రెండూ) యొక్క అత్యున్నత పాలకుడైన వ్యక్తిని సూచిస్తుంది.

  • బైబిల్ కాలాల్లో, ఒక రాజు సాధారణంగా మునుపటి రాజు(ల)తో ఉన్న కుటుంబ సంబంధాల ఆధారంగా పరిపాలించడానికి ఎన్నిక చెయ్యబడతాడు. ఒక రాజు చనిపోయినప్పుడు, సాధారణంగా అతని పెద్ద కుమారుడు తదుపరి రాజు అవుతాడు.
  • బైబిల్ తరచుగా దేవుణ్ణి విశ్వం మొత్తాన్ని (సాధారణ అర్థంలో) మరియు అతని ప్రజలపై (నిర్దిష్ట అర్థంలో) పరిపాలించే రాజుగా సూచిస్తుంది.
  • కొత్త నిబంధన యేసును అనేక విధాలుగా రాజుగా సూచిస్తుంది, వాటితో సహా: "యూదుల రాజు;" "ఇశ్రాయేలు రాజు;" మరియు "రాజుల రాజు."
  • సందర్భాన్ని బట్టి, “రాజు” అనే పదాన్ని “అత్యున్నతుడైన అధికారి" లేదా “సార్వభౌమ పాలకుడు” అని కూడా అనువదించవచ్చు.
  • “రాజుల రాజు” అనే పదబంధాన్ని “ఇతర రాజులందరినీ పరిపాలించే రాజు” లేదా “ఇతర పాలకులందరిపై అధికారం ఉన్న సర్వోన్నత పాలకుడు” అని అనువదించవచ్చు.

(చూడండి:authority, Herod Antipas, kingdom, kingdom of God)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __8:6__ఒక రాత్రి, ఫరో(ఐగుప్తీయులు తమ రాజును ఈ విధంగా పిలుచుకొంటారు,) రాజుకు రెండు కలలు వచ్చాయి, అవి అతనిని అధికంగా కలవరపరచాయి.
  • __16:1__ఇశ్రాయేలీయులకు రాజు లేడు, కనుక ప్రతి వాడును తన తన ఇస్త్తానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.
  • __16:18__చివరిగా ప్రజలు ఇతర దేశాలకు ఉన్నట్టుగా ఒక రాజు కొరకు దేవుణ్ణి అడిగారు.
  • __17:5__కాలక్రమలో సౌలు యుద్ధంలో చనిపోయాడు, దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు. అతను మంచి రాజు, ప్రజలు అతనిని ప్రేమించారు.
  • 21:6 దేవుని ప్రజలు కూడా మెస్సయను ప్రవక్త అని పిలిచారు, ప్రధాన యాజకుడు, ఒక రాజు.
  • __48:14__దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, అయితే ప్రభువైన యేసు సమస్త లోకానికి రాజు!

పదం సమాచారం:

  • Strongs: H4427, H4428, H4430, G09350, G09360