te_tw/bible/other/image.md

3.3 KiB
Raw Permalink Blame History

స్వరూపం, స్వరూపాలు, చెక్కిన ప్రతిమ, చెక్కిన ప్రతిమలు, పోత విగ్రహాలు, బొమ్మ, బొమ్మలు, చెక్కిన బొమ్మ, చెక్కిన బొమ్మలు, లోహం పోతపోసిన బొమ్మ, లోహం బొమ్మలు

నిర్వచనం:

ఈ పదాలు అబద్ధ దేవుళ్ళ విగ్రహాలను సూచించడానికి ఉపయోగిస్తారు. పూజా విగ్రహాలు, "స్వరూపం" "చెక్కిన ప్రతిమ" అనే మాటలు కూడా వాడతారు.

  • "చెక్కిన ప్రతిమ” లేక “చెక్కిన బొమ్మ" అంటే కొయ్యతో చేసిన ప్రతిమ. జంతువు, వ్యక్తి, లేక వస్తు రూపం.
  • "పోత పోసిన లోహం బొమ్మ" అంటే లోహం కరిగించి పోత పోసి జంతువు, లేక వ్యక్తి ఆకారం తీసుకు వస్తారు.
  • ఈ కొయ్యతో లోహంతో చేసిన బొమ్మలను అబద్ద దేవుళ్ళ పూజకు ఉపయోగిస్తారు.
  • "స్వరూపం" అంటే విగ్రహం కొయ్యతో, లోహంతో చేసిన బొమ్మ.

అనువాదం సలహాలు:

  • విగ్రహం గురించి చెప్పేటప్పుడు "స్వరూపం" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "విగ్రహం” లేక “చెక్కిన విగ్రహం” లేక “చెక్కిన మత ప్రతిమ."
  • కొన్ని భాషల్లో స్పష్టంగా ఉండవచ్చు. ఎప్పుడూ వర్ణనాత్మక పదం వాడాలి. "చెక్కిన ప్రతిమ” లేక “లోహం పోతపోసిన బొమ్మఅనే మాటలు వాడాలి. "స్వరూపం” లేక “బొమ్మ" అనే మాటలు మూల భాషలో ఉన్నప్పటికీ ఇలా రాయాలి.
  • ఈ పదాన్ని వివిధ రీతులలో దేవుని పోలికకు ఉపయోగిస్తారు అని స్పష్టంగా చెప్పాలి.

(చూడండి: false god, God, false god, image of God)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0457, H1544, H2553, H4541, H4676, H4853, H4906, H5257, H5262, H5566, H6091, H6456, H6459, H6754, H6755, H6816, H8403, H8544, H8655, G15040, G51790