te_tw/bible/names/baal.md

4.5 KiB
Raw Permalink Blame History

బయలు

వాస్తవాలు:

"బయలు"అంటే "ప్రభువు” లేక “యజమాని"కనానీయులు ఆరాధించిన ముఖ్య అబద్ధ దేవుడి పేరు.

  • స్థానిక అబద్ధ దేవుళ్ళు కూడా ఉన్నారు. వారి పేర్లలో "బయలు"అనే మాట ఉంటుంది. ఉదాహరణకు "బయలు పెయోరు."cకొన్నిసార్లు ఈ దేవుళ్ళను కలిపి "బయలులు"అంటారు.
  • కొందరి పేర్లలో ఈ పదం "బయలు"కలిసి ఉంటుంది.
  • బయలు ఆరాధనలో పిల్లలను బలి ఇవ్వడం, వేశ్యలను ఉపయోగించడం వంటి దుష్టఆచారాలు మిళితమై ఉంటాయి.
  • వివిధ సమయాల్లో వారి చరిత్ర అంతటా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న ఇతర విగ్రహారాధక జాతుల వలె బయలు ఆరాధనల్లో లోతుగా నిమగ్నం అయ్యారు.
  • రాజు ఆహాబు పరిపాలన దేవుని ప్రవక్త ఏలియా బయలు అనే దేవుడు లేడని యెహోవా ఒక్కడే నిజ దేవుడనీ రుజువు చెయ్యడానికి ఒక పరీక్ష పెట్టాడు. ఫలితంగా బయలు ప్రవక్తలు హతం అయ్యారు. ప్రజలు మరలా యెహోవా ఆరాధించసాగారు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆహాబు, అషేరా, ఏలియా, అబద్ధ దేవుడు, వేశ్య, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 19:02 ఆహాబు బయలు అనే పేరు గల అబద్ధ దేవుణ్ణి ప్రజలు ఆరాధించాలని ప్రోత్సాహించిన దుర్మార్గుడు.
  • 19:06 మొత్తం ఇశ్రాయేల్ రాజ్యం ప్రజలంతా, 450మది బయలు ప్రవక్తలు, కర్మేల్ కొండకు వచ్చారు. ఏలియా ప్రజలతో చెప్పాడు, "ఎంత కాలం మీరు మీ మనసు మార్చుకుంటూ ఉంటారు? యెహోవా దేవుడు అయితే ఆయన్ని సేవించండి. బయలు దేవుడు అయితే ఆయన్ని సేవించండి!"
  • 19:07 తరువాత ఏలియా బయలు ప్రవక్తలకు, ఇలా చెప్పాడు. "ఒక ఎద్దును వధించి బలి అర్పణ సిద్ధం చెయ్యండి. అయితే మంట పెట్టవద్దు.
  • 19:08 తరువాత బయలు ప్రవక్తలు బయలుకు ప్రార్థించారు, " ఓ బయలు, మా మాట విను!"
  • 19:12 ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకున్నారు. తరువాత ఏలియా వారిని అక్కడి నుండి తీసుకుపోయి చంపమని అజ్ఞాపించాడు.''

పదం సమాచారం:

  • Strong's: H1120, G896