5.4 KiB
5.4 KiB
దయ్యం, దురాత్మ, అపవిత్రాత్మ
నిర్వచనం:
ఈ పదాలు అన్నీ దేవుని చిత్తాన్ని/సంకల్పాన్ని వ్యతిరేకించు ఆత్మలై ఉన్న దయ్యాలను సూచించుచున్నవి.
- దేవుడు తనను సేవించడానికి దేవదూతలను సృష్టించాడు. సాతాను దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినప్పుడు కొన్ని దేవదూతలు కూడా తిరుగుబాటులో పాల్గొని పరలోకం నుండి గెంటివేయబడ్డాయి. దయ్యాలు, దురాత్మలు ఈ "పతనమైన/పడిపోయిన దేవదూతలు" అని పరిగణించబడ్డాయి.
- కొన్ని సార్లు ఈ దయ్యాలను "అపవిత్రాత్మలు"గా పిలువబడ్డాయి. "అపవిత్రత" అంటే "అపరిశుద్ధ” లేక “దుష్ట” లేక “అపవిత్ర/మలినమైన."
- దయ్యాలు సాతానును సేవిస్తాయి గనుక అవి దుర్మార్గాలు చేస్తాయి. కొన్ని సార్లు అవి మనుషుల్లో దూరి వారిని అదుపు/నియంత్రిస్తాయి చేస్తారు.
- దయ్యాలు మనుషుల కంటే శక్తివంతమైనవి. కాని దేవుడనంత శక్తివంతమైనవి కావు.
అనువాదం సూచనలు:
- "దయ్యం" అనే పదమును "దురాత్మ"అని కూడా అనువదించవచ్చు.
- "అపవిత్రాత్మ" అనే పదమును "అపరిశుద్ధ ఆత్మ” లేక “చెడిన ఆత్మ” లేక “దురాత్మ” అని కూడా అనువాదం చెయ్య వచ్చు.
- సాతానును సూచించే, ఈ పదము కొరకు అనువాదంలో ఉపయోగించిన పదము లేక పదబంధము సాతానును సూచించే పదముకు భిన్నంగా/వేరుగా ఉండు నట్లు చూసుకోండి.
- "దయ్యం" అనే పదమును కూడా స్థానిక లేదా జాతీయ భాషలో ఎలా అనువదించారు చూడండి.
(చూడండి:demon-possessed, Satan, false god, false god, angel, evil, clean)
బైబిల్ రిఫరెన్సులు:
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
*__26:9__అనేక మంది ప్రజలు దయ్యాలు పట్టిన వారిని యేసు దగ్గరకు తెచ్చారు. యేసు వాటికి అజ్ఞాపించినప్పుడు దయ్యాలు మనుషుల నుండి బయటకు వచ్చాయి మరియు అవి తరచుగా "నీవు దేవుని కుమారుడవు!" అని అరిచాయి.
- 32:8 దయ్యాలు ఆ మనిషిలోనుండి బయటికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి.
- __47:5__చివరకు ఒక రోజు బానిస బాలిక కేకలు వేస్తుంటే, పౌలు ఆమె వైపు తిరిగి ఆమెలోని దయ్యాన్ని బయటికి రమ్మని చెప్పాడు." వెంటనే దయ్యం ఆమెను విడిచి పోయింది.
- 49:2 ఆయన (యేసు) నీటిపై నడిచాడు, తుఫానును శాంతపరిచాడు/నిమ్మళ్ళ పరచాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను 5,000 మందిని ఆహారంగా ఇచ్చాడు.
పదం సమాచారం:
Strong’s: H2932, H7307, H7451, H7700, G01690, G11390, G11400, G11410, G11420, G41900, G41510, G41520, G41890