te_tw/bible/kt/satan.md

8.2 KiB
Raw Permalink Blame History

సాతాను, దయ్యం, దుష్టుడు

వాస్తవాలు:

దయ్యం దేవుడు సృష్టించిన ఆత్మ అయినప్పటికీ, అది దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేశాడు మరియు దేవునికి శత్రువుగా మారాడు. దెయ్యమును “సాతాను” మరియు “దుష్టుడు” అని కూడా పిలుస్తారు.

  • దయ్యం దేవుణ్ణి మరియు దేవుడు సృష్టించిన ప్రతిదానిని ద్వేషిస్తుంది  ఎందుకంటే వాడు దేవుని స్థానమును పొందుకోవాలని మరియు దేవునిలా ఆరాధించబడాలని కోరుకున్నాడు.
  • దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేయునట్లు సాతాను ప్రజలను ప్రేరేపిస్తాడు.
  • ప్రజలను సాతాను నియంత్రణనుండి రక్షించుటకు దేవుడు తన కుమారుడైన యేసును పంపించాడు.
  • “సాతాను” అను పేరుకు “అపవాధి” లేక “శత్రువు” అని అర్థము.
  • “దెయ్యము” అను పదమునకు “ఆరోపించువాడు” అని అర్థము.

అనువాదం సూచనలు:

  • “దెయ్యం” అనే పదమును “ఆరోపించువాడు” లేక “దుష్టుడు” లేక “దుష్టాత్మలకు రాజు” లేక “ప్రధాన దుష్టాత్మ” అని కూడా అనువదించ వచ్చు.
  • “సాతాను” అనే పదమును “విరోధి” లేక “అపవాది” లేక వాడు దెయ్యము అని అర్ధాన్ని ఇచ్చే ఇతర పేర్లతో అంవదించవచ్చు.
  • ఈ పదాలన్ని దెయ్యము మరియు దుష్టాత్మ అనే పదాలకు విభిన్నముగా అనువదించ వలయును.
  • ఈ పదాలన్నిటిని స్థానిక లేక జాతీయ భాషలో ఎలా అనువదించారో  గమనించండి.

(చూడండి: పేర్లను అనువదించడము ఎలా) How to Translate Names

(అనువాదం సలహాలు:పేర్లను అనువదించడము ఎలా) (Translation suggestions: How to Translate Names)

(ఈ పదములను కూడా చూడండి: దయ్యము, evil, kingdom of God, tempt)

బైబిల్ రెఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __21:1__హవ్వను మోసగించిన సర్పమే  సాతాను. మెస్సయ్యా వచ్చి   సాతానును పూర్తిగా  ఓడించునని వాగ్ధానము చేయబడియుండెను.
  • 25:6 ఆ తరువాత సాతాను యేసుకు ఈ లోక రాజ్యములన్నిటిని మరియు వాటి వైభవమును చూపించి, “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసి, నన్ను ఆరాధించినయెడల, వీటన్నిటిని నీకి చ్చెదను” అని చెప్పెను.
  • __25:8__యేసు సాతాను శోధనలకు లోబడలేదు గనుక సాతాను ఆయనను వదిలి వెళ్ళెను.
  • __33:6__అతట యేసు, “విత్తనము దేవుని వాక్యము” అనియు దేవుని వాక్యము విని దానిని  అర్ధం చేసుకొనని వ్యక్తి,త్రోవ   అనియు,  దెయ్యము వానినుండి దేవుని వాక్యమును తీసివేయును అనియు  వివరించెను.
  • __38:7__యూదా రొట్టెను తీసుకొనిన తరువాత,  సాతానుడు వానిలోనికి ప్రవేశించెను.
  • __48:4__హవ్వ సంతానములో ఒకరు సాతాను తలను నలగగొట్టుదురు, మరియు సాతాను అతని  మడిమకు గాయము చేయును అని దేవుడు వాగ్ధానము చేసియుండెను. సాతాను మెస్సయ్యాను చంపును,  కాని దేవుడు మరల ఆయనను తిరిగి సజీవునిగా చేయును, మరియు మెస్సయ్యా సాతాను శక్తిని నలగగొట్టును అని దీని అర్ధము.
  • __49:15__దేవుడు నిన్ను సాతాను యొక్క చీకటి రాజ్యములోనుండి బయటికి తీసుకొని వచ్చి, దేవుని వెలుగు రాజ్యములోనికి ప్రవేశపెట్టెను.
  • 50:9 “గురుగులు దుష్టునికి సంబంధించిన ప్రజలను సూచిస్తుంది. గురుగులను విత్తిన శత్రువు దెయ్యమును సూచిస్తుంది.”
  • 50:10 “లోకము యొక్క అంతము సంభవించినప్పుడు  దూతలన్నియు  దుష్టునికి సంబంధించిన ప్రతియోక్కరిని ఒక్క దగ్గరికి పోగు చేస్తారు మరియు వారిని అగ్నిలోనికి పారవేస్తారు, అక్కడ పండ్లు కొరుకుటయు మరియు ఏడ్పును ఉండును”
  • __50:15__యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన సాతానును మరియు తన రాజ్యమును పూర్తిగా  నాశనము చేయును. ఆయన సాతానును మరియు దేవునికి లోబడక వానిని అనుసరించే ప్రతియొక్కరిని నరకములోనికి పడవేసి, శాశ్వతముగా కాల్చివేయును.

పదం సమాచారం:

  • Strong's: H7700, H7854, H8163, G11390, G11400, G11410, G11420, G12280, G41900, G45660, G45670