te_tw/bible/kt/tempt.md

4.3 KiB

శోధించు, శోధన

నిర్వచనం:

ఎవరినైనా శోధించడం అంటే ఆ వ్యక్తి ఏదైనా తప్పు చెయ్యమని ప్రేరేపించు.

  • శోధన అంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసేలా నడిపించేది.
  • మనుషులు వారి స్వంత పాపపు స్వభావం మూలంగా, లేక ఇతరుల మూలంగా శోధన ఎదుర్కొంటారు.
  • సాతాను మనుషులు దేవుణ్ణి ధిక్కరించేలా ఆయనకు వ్యతిరేకంగా చెడ్డ పనులు చేసేలా ప్రేరేపిస్తాడు/శోధిస్తాడు.
  • సాతాను యేసును పాపం చెయ్యడానికి ప్రేరేపించాడు. అయితే యేసు సాతాను శోధనలకు లొంగలేదు. పాపం చెయ్యలేదు.
  • వరైనా "దేవుణ్ణి శోధించడం” అంటే ఆయన్ని ఏదైనా తప్పు చెయ్యమని కాదు. అతడు తలబిరుసుగా అవిధేయతతో దేవుడు తనను శిక్షించేలా చేసుకుంటున్నాడు. దీన్ని "దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు" అని కూడా రాయవచ్చు.

అనువాదం సూచనలు:

  • "శోధించు" అనే మాటను ఇలా కూడా అనువదించ వచ్చు. "పాపం చేసేలా ప్రోత్సహించు” లేక “మరులు గొలుపు” లేక “పాపం చెయ్యాలని కోరుకోవడం."
  • "శోధనలు" అనే మాటను అనువదించడంలో ఇతర విధానాలు "ఆకర్షించే విషయాలు” లేక “ఎవరినైనా పాపం చేసేలా ప్రోత్సహించడం” లేక “ఏదైనా తప్పు చేసేలా ఒకడు కోరుకునేలా చెయ్యడం.
  • "దేవుణ్ణి శోధించు" అనే దాన్ని ఇలా అనువాదం చెయ్యవచ్చు. "దేవుణ్ణి పరీక్షకు గురి చెయ్యడం” లేక “దేవునికి పరీక్షించడం” లేక “దేవుని సహనాన్ని పరిక్షించడం” లేక “దేవుడు తనను శిక్షించే పరిస్థితి కల్పించడం” లేక “తలబిరుసుగా దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉండడం."

(చూడండి:disobey, Satan, sin, test)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 25:1 తరువాత సాతాను యేసు దగ్గరికి వచ్చి ఆయనను పాపం చేసేలా శోధించాడు.
  • 25:8 యేసు సాతాను శోధనలకు లొంగలేదు, గనుక సాతాను వెళ్ళిపోయాడు.
  • 38:11 యేసు తన శిష్యులకు వారు శోధనలో పడకుండా ప్రార్థించాలని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strong's: H0974, H4531, H5254, G05510, G15980, G39850, G39860, G39870