te_tw/bible/kt/clean.md

8.0 KiB
Raw Permalink Blame History

శుద్ధమైన, కడుగు

నిర్వచనం:

"శుద్ధమైన" పదం సాధారణంగా ఒకని నుండి/ఒకదాని నుండి మురికిని గానీ లేదా మరకలను తొలగించడం లేదా మొదటి స్థానంలో ఎటువంటి మురికి లేదా మరక లేకుండా ఉండడం అని సూచిస్తుంది. "కడుగు" పదం ప్రత్యేకంగా ఒకరి నుండి/ఒకదాని నుండి మురికినీ లేదా మరకనూ తొలగించే చర్యను సూచిస్తుంది.

  • "శుద్ధపరచు" అంటే దేనినైనా "శుద్ధి"గా చెయ్యడం. ఇది "కడుగు” లేదా “పవిత్రపరచు" అని కూడా అనువదించబడవచ్చు.
  • పాత నిబంధనలో, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆచార పరమైన " శుద్ధజంతువులు" ఏమిటో “అశుద్ధ" జంతువులు ఏమిటో చెప్పాడు. శుద్ధ జంతువులు మాత్రమే ఆహారం కోసం లేదా బలి కోసం  వినియోగించబడతాయి. ఈ సందర్భంలో "శుద్ధిచెయ్యడం" పదం దేవునికి బలిగా ఉపయోగించడం కోసం జంతువు అంగీకరించబడింది అని అర్థం.
  • నిర్దిష్ట చర్మ రోగాలు ఉన్న వ్యక్తి అది ఇక అంటువ్యాధిగా ఉండకుండా స్వస్థత పొందేంత వరకూ ఆశుద్ధుడిగానే ఉంటాడు. ఆ వ్యక్తి తిరిగి "శుద్ధుడు"గా ప్రకటించబడడానికి చర్మం శుద్ధి కోసం హెచ్చరికలకు విధేయత చూపించాలి.
  • కొన్నిసార్లు "శుద్ధమైన" పదం నైతిక పవిత్రతను సూచిస్తూ అలంకారికంగా వినియోగించబడింది. అంటే పాపం నుండి "శుద్ధి" కావడం అని అర్థం.

బైబిలులో "అశుద్ధం" పదం ప్రజలు తాకడానికీ. తినడానికీ, బలి అర్పించడానికీ పనికిరానివని దేవుడు ప్రకటించిన వాటిని అలంకారికంగా సూచిస్తుంది.

  • దేవుడు "శుద్ధమైన" జంతువులను గురించీ, "ఆశుద్ధమైన" జంతువులను గురించీ ఇశ్రాయేలీయులకు  హెచ్చరికలు ఇచ్చాడు. అశుద్ధమైన జంతువులు తినడానికి గానీ లేదా బలి అర్పించడానికి గానీ ఉపయోగించడానికి అనుమతించబడవు.
  • కొన్ని నిర్దిష్ట చర్మ రోగాలు ఉన్న ప్రజలు స్వస్థత పొందేంత వరకూ "అశుద్ధులు" గా ఉంటారు.
  • ఇశ్రాయేలీయులు అశుద్ధమైన దానిని దేనినైనా తాకినట్లయితే వారు తమకుతాము కాలంపాటు ఆశుద్దులుగా యెంచబడతారు.
  • అశుద్ధమైన వాటిని ముట్టుకోవడం, లేదా తినడం గురించిన దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం ఇశ్రాయేలీయులను దేవుని సేవ కోసం ప్రత్యేక పరుస్తుంది.
  • ఈ శారీరక, ఆచార పరమైన అశుద్ధత నైతిక అశుద్ధతకు కూడా సంకేతంగా ఉంది.
  • "అశుద్ధమైన ఆత్మ" మరొక భాషా రూపంలో ఒక దురాత్మను సూచిస్తుంది.

అనువాదం సలహాలు:

· ఈ పదం "శుద్ధమైన" లేదా "పవిత్రమైన" (మురికిగా ఉండకుండా ఉండడం భావంలో) కోసం సాధారణంగా ఉపయోగించే పదాలతో అనువదించబడవచ్చు.

·  "ఆచారపరంగా శుద్ధిగా ఉండడం" లేదా "దేవునికి అంగీకారంగా ఉండడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.

· "శుద్ధీకరణ" ను "కడగడం" లేదా "పవిత్రపరచడం" చేత అనువదించ వచ్చు.

· "శుద్ధి," "శుద్ధి చెయ్యడం" కోసం ఉపయోగించే పదాలు అలంకారిక భావంలో కూడా అర్థం అయ్యేలా చూడండి.

·  "అశుద్ధం" పదం "శుద్ధంగా లేకపోవడం" లేదా "దేవుని దృష్టిలో పనికిరానిది" లేదా ""శారీరకంగా అశుద్ధమైనది" లేదా "మలినమైనది" అని అనువదించబడవచ్చు.

· ఒక దురాత్మను ఆశుద్ధమైన ఆత్మగా సూచిస్తున్నప్పుడు "అశుద్ధం" పదం "దుష్టమైనది" లేదా "అపవిత్రమైనది" అని అనువదించబడవచ్చు.

· ఈ పదం అనువాదం ఆత్మ సంబంధమైన అశుద్ధత అర్దాన్ని అనుమతించాలి. తాకడానికీ, తినడానికీ, లేదా బలిఅర్పించడానికీ పనికిరానివిగా దేవుడు ప్రకటించిన దేనినైనా ఇది సూచించగలిగియుండాలి.

(చూడండి:defile, demon, holy, sacrifice)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G01670, G01690, G25110, G25120, G25130, G28390, G28400, G33940, G36890