te_tw/bible/other/fellowshipoffering.md

2.2 KiB

సహవాస అర్పణ, సహవాస అర్పణలు

వాస్తవాలు:

పాత నిబంధనలో, "సహవాసం అర్పణ" అనేది ఒక రకమైన బలి అర్పణ. దీన్ని వివిధ కారణాలవల్ల అర్పిస్తారు. దేవునికి కృతఙ్ఞతలు చెప్పడానికి, మొక్కుబడి నెరవేర్చడానికి మొ.

  • ఈ అర్పణలో మగ లేక ఆడ జంతువును బలి ఇవ్వాలి. ఇది దహన బలికి భిన్నమైనది. దానికైతే మగ జంతువే కావాలి.
  • తరువాత బలి అర్పణలో కొంత భాగం దేవునిది. సహవాస అర్పణ తెచ్చ౯న వ్యక్తి బలి మాంసాన్ని యాజకులతో ఇతర ఇశ్రాయేలీయులతో పంచుకుంటాడు.
  • ఇక్కడ చేసే భోజనంలో పొంగని రొట్టెలు తినాలి.
  • కొన్ని సార్లు దీన్ని "సమాధాన బలి" అన్నారు.

(చూడండి: దహన బలి, నెరవేర్చు, నైవేద్యం, అపరాధ భావము అర్పణ, శాంతి అర్పణ, యాజకుడు, బలి అర్పణ, పొంగని రొట్టె, ఒట్టు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8002