te_tw/bible/other/grainoffering.md

1.7 KiB

నైవేద్యం, నైవేద్యాలు

నిర్వచనం:

నైవేద్యం గోదుమ లేక బార్లీ పిండితో చేసి దేవునికి అర్పించే కానుక. తరచుగా దీన్ని దహన బలి తరువాత చేస్తారు.

  • నైవేద్యం కోసం వాడే ధాన్యం మెత్తగా నలిపి ఉండాలి. కొన్ని సార్లు అర్పించడానికి ముందు దీన్ని వండాలి. అయితే ఇతర సమయాల్లో పచ్చి పిండి అర్పించాలి.
  • ధాన్యం పిండికి నూనె, ఉప్పు కలుపుతారు. అయితే పొంగజేసే పదార్థం కలపరు. తేనె కలప వచ్చు.
  • నైవేద్యంలో కొంత భాగం తగలబెట్టాలి. దానిలో కొంత యాజకులు తింటారు.

(చూడండి: దహన బలి, అపరాధ భావం అర్పణ , బలి అర్పణ, పాపం అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4503, H8641