5.3 KiB
5.3 KiB
నెరవేర్చు, నెరవేర్చిన, చేపట్టారు
నిర్వచనం:
"నెరవేర్చు" అంటే పూర్ణమైన రీతిలో అనుకున్నది దేనినైనా సాధించడం అని అర్థం.
- ప్రవచనం నెరవేరినప్పుడు ప్రవచనం లో చెప్పిన ప్రకారం జరిగేలా దేవుడు చేస్తాడు అని అర్థం.
- ఒక వ్యక్తి వాగ్దానం లేక ప్రమాణం నెరవేర్చడం అంటే అతడు వాగ్దానం చేసిన దాని ప్రకారం చేశాడు అని అర్థం.
- బాధ్యత నెరవేర్చడం అంటే కేటాయించబడిన లేదా అవసరమైన పనిని చేయడం.
అనువాదం సలహాలు:
- సందర్భం ఆధారంగా "నెరవేర్చు" పదం "సాధించు” లేక “పూర్తి చెయ్యి” లేక “జరిగేలా చెయ్యడం” లేక “లోబడు” లేక “ఆచరించు" అని అనువదించబడవచ్చు.
- "నెరవేర్చబడింది" పదం “నిజం అయ్యింది” లేదా “జరిగింది” లేదా ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నిజమయింది” లేక “సంభవించింది” లేక “చోటు చేసుకొంది” అని అనువదించబడవచ్చు.
- "నెరవేర్చు," పదం “నీ పరిచర్యను నెరవేర్చు” వాక్యంలో ఉన్నట్టుగా అనువదించే విధానాలలో “పూర్తిచేయ్యడం” లేదా “ఆచరిచడం” లేదా “అభ్యసించడం” లేదా “దేవుడు నువ్వు చెయ్యాలని నిన్ను పిలిచినప్పుడు ఇతర ప్రజలను సేవించాలి” అని ఉండవచ్చు.
(చూడండి: [ప్రవక్త] (../kt/prophet.md), Christ, minister, call)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 2:27
- అపో.కా 3:17-18
- లేవికాండము 22:17-19
- లూకా 4:21
- మత్తయి 1:22-23
- మత్తయి 5:17
- కీర్తనలు116:12-15
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- __24:4__యోహాను ప్రవక్త "చూడండి నా వార్తాహరుడిని నీ దారి సిద్ధం చెయ్యడానికి నీకు ముందుగా పంపుతున్నాను” అని పలికిన దానిని నెరవేర్చాడు,*
- 40:3 సైనికులు యేసు వస్త్రాల కోసం చీట్లు వేశారు. వారు దీనిని చేసినప్పుడు, వారు వారు "వారు నా వస్త్రాలను వారి మధ్య పంచుకున్నారు, నా వస్త్రాల కోసం చీట్లు వేశారు” అని చెప్పబడిన దేవుని ప్రవచనం నెరవేర్చారు.
- __42:7__యేసు చెప్పాడు, "నేను మీకు చెప్పాను దేవుని వాక్యంలో నన్ను గురించి రాయబడిన ప్రతీది నెరవేరుతుంది.”
- __43:5__ప్రవక్త యోవేలు ద్వారా, “అంత్య దినాలలో, నేను నా ఆత్మను కుమ్మరిస్తాను” అని దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది."
- 43:7'నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్ళిపోనియ్యవు” అని చెప్పిన ప్రవచనాన్ని ఇది నెరవేరుస్తుంది.
- 44:5“మీరు చేస్తున్నది మీకు అర్థం కాకపోయినప్పటికీ దేవుడు మీ క్రియలు ఉపయోగించి మెస్సియా బాధలు పడి చనిపోతాడనే ప్రవచనాలు నెరవేరుస్తాడు.
పదం సమాచారం:
- Strong’s: H1214, H5487, G10960, G41380