te_tw/bible/kt/call.md

7.0 KiB
Raw Permalink Blame History

పిలుపు, పిలిచాడు

నిర్వచనం:

"పిలుపు” “బయటకు పిలుపు"అంటే దేన్నైనా ఎవరినైనా గట్టిగా పిలవడం. "పిలవడం"అంటే ఎవరినైనా పేరుపెట్టి రమ్మనడం. దీనికి ఇతర అర్థాలు కూడా ఉన్నాయి.

  • "బయటికి పిలవడం"అంటే ఎవరినైనా గట్టిగా పిలిచి, అరిచి చెప్పడం. దీనికి ఈ అర్థం కూడా ఉంది. ఎవరినైనా ముఖ్యంగా దేవుణ్ణి సాయం కోసం అడగడం.
  • తరచుగా బైబిల్లో, "పిలుపు"అనే దాని అర్థం "రప్పించు” లేక “రమ్మని ఆజ్ఞ ఇచ్చు” లేక “రమ్మని అడుగు."
  • దేవుడు ప్రజలను తన ప్రజలుగా ఉండమని పిలుపునిస్తున్నాడు. అది వారి "పిలుపు."
  • దేవుడు మనుషులకు "పిలుపు"ఇచ్చినప్పుడు వారు దేవునిచే నియమించ బడిన తన పిల్లలుగా, సేవకులుగా ఎన్నుకోబడిన ప్రజలుగా యేసు మూలంగా కలిగే తన రక్షణ సందేశం ప్రకటించే వారుగా అవుతారు.
  • ఈ పదాన్ని ఎవరికైనా పేరు పెట్టే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, "అతని పేరు యోహాను అని పిలిచారు,"అంటే, "అతడు యోహాను అనే పేరు గలవాడు” లేక “తన పేరు యోహాను"అని అర్థం.
  • "పేరుతొ పిలవడం"అంటే ఎవరినైనా వేరొకరి పేరుతో పిలవడం. దేవుడు తన ప్రజలను తన పేరుతో పిలిచాడు.
  • మరొక మాట, "నేను నిన్ను పేరుతొ పిలిచాను"అంటే దేవుడు ఇదమిద్ధంగా ఒక మనిషిని ఎన్నుకొన్న విషయం.

అనువాదం సూచనలు:

  • ఈ "పిలుపు"అనే దాన్ని ఒక పదంతో అనువదించ వచ్చు. "పని అప్పగించు,"ఇందులో కావాలని ఒక ఉద్దేశంతో పిలుపునివ్వడం.
  • "నీకు మొర్ర పెట్టాను"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నీ సహాయం కోసం అడిగాను” లేక “అత్యవసరంగా నిన్ను ప్రార్థించాను."
  • దేవుడు "పిలిచాడు" మనలను తన సేవకులుగా పిలిచాడు అని బైబిల్ చెప్పినప్పుడు దాన్ని ఇలా అనువదించవచ్చు. "మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు.” లేక “తన సేవకులుగా మనలను నియమించాడు.”
  • "నీవు అతన్ని ఈ పేరుతో పిలవాలి"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు., "నీవు అతనికి పేరు పెట్టాలి."
  • "తన పేరు పిలిచాడు"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తన పేరు ఇది.” లేక “అతడు పేరు పెట్టాడు."
  • "బయటికి పిలుపునివ్వడం" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు, "గట్టిగా పిలవడం” లేక “అరవడం” లేక “పెద్ద స్వరంతో పిలవడం." దీని అనువాదం ఒక వ్యక్తి కోపగించుకున్నట్టుగా ధ్వనించకుండా జాగ్రత్తపడండి.
  • "నీ పిలుపు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నీ ఉద్దేశం” లేక “మీ కోసం దేవుని ఉద్దేశం” లేక “మీకోసం దేవుని ప్రత్యేకమైన పని."
  • "ప్రభువు పేరున పిలుపు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రభువుకేసి చూసి ఆయనపై ఆధారపడండి,” లేక “ప్రభువుపై నమ్మకముంచి ప్రభువుకు లోబడు."
  • "దేనికోసమైనా పిలుపు"అనే మాటను ఇలా అనువదించ వచ్చు. "అధికారికంగా అడుగు” లేక “కోరు” లేక “ఆజ్ఞ ఇచ్చు."
  • "నా పేరుతొ నిన్ను పిలిచాను"అనే మాటను ఇలా అనువదించ వచ్చు, "నీకు నా పేరు ఇచ్చాను, నీవు నాకు చెందిన వాడివని కనపరిచాను."
  • "దేవుడు, "నిన్ను పేరు పెట్టి పిలిచాను," అన్నప్పుడు ఇలా అనువదించ వచ్చు, "నిన్ను ఎరిగి నిన్ను ఎన్నుకున్నాను."

(చూడండి:pray, cry)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0559, H2199, H4744, H6817, H7121, H7123, H7769, H7773, G01540, G03630, G14580, G15280, G19410, G19510, G20280, G20460, G25640, G28210, G28220, G28400, G29190, G30040, G31060, G33330, G33430, G36030, G36860, G36870, G43160, G43410, G43770, G47790, G48670, G54550, G55370, G55810