6.2 KiB
6.2 KiB
ప్రార్థించు, ప్రార్థన
నిర్వచనం:
“ప్రార్థించు,” “ప్రార్థన” అనే పదాలు దేవునితో మాట్లాడడానిని సూచిస్తున్నాయి. ఈ పదాలు అబద్ధపు దేవునితో మాట్లాడుటకు ప్రయత్నించు ప్రజలను సూచించడానికి కూడా వినియోగించబడుతున్నాయి.
- ప్రజలు మౌనముగా ఉండి ప్రార్థించవచ్చు, వారి ఆలోచనలతో దేవునితో మాట్లాడవచ్చు, లేదా వారు గట్టిగా అరిచి ప్రార్థించవచ్చు, వారి స్వరముతో దేవునితో మాట్లాడవచ్చును. దావీదు కీర్తనల గ్రంథములో తన ప్రార్థనలను వ్రాసికొనినట్లుగా కొన్నిమార్లు ప్రార్థనలను రాయబడి ఉంటాయి.
- ప్రార్థనలో కనికరము కోసం, సమస్య విషయంలో సహాయం కోసం, మరియు నిర్ణయాలు చెయ్యడంలో జ్ఞానం కోసం దేవునిని అడుగడం, ఉంటాయి.
- తరచుగా ప్రజలు రోగులుగా ఉన్న ప్రజలను లేదా ఇతర విషయాలలో ఆయన సహాయం అవసరం ఉన్నవారిని స్వస్థపరచమని దేవునిని వేడుకుంటారు.
- ప్రజలు దేవునికి ప్రార్థన చేయునప్పుడు ఆయనను స్తుతిస్తారు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు.
- ప్రార్థనలో దేవునితో మన పాపములను ఒప్పుకోవడం, మనలను క్షమించమని ఆయనను అడగడం ఉంటాయి.
- దేవునితో మాట్లాడడం కొన్నిసార్లు మన ఆత్మ ఆయన ఆత్మతో సంభాషించుచున్నప్పుడు, మన భావోద్రేకాలను ఆయనతో పంచుకొంటున్నప్పుడు, ఆయన సన్నిధిని ఆనందించుచున్నప్పుడు అది "సంభాషించడం" అని పిలువబడుతుంది.
- ఈ పదం "దేవునితో మాట్లాడడం" లేదా "దేవునితో సంభాషించడం" అని అనువదించబడవచ్చు. ఈ పదం అనువాదంలో మౌనంగా ఉండే ప్రార్థన అనే అర్థం జతచెయ్యబడాలి.
(చూడండి:false god, forgive, praise)
బైబిలు రిఫరెన్సులు:
- 1తెస్సా 3:9
- అపో.కా 8:24
- అపో.కా 14:26
- కొలస్సీ 4:4
- యోహాను 17:9
- లూకా 11:1
- మత్తయి 5:43-45
- మత్తయి 14:22-24
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- __6:5__ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థించాడు, మరియు ఆమె కవల పిల్లలతో గర్భవతి కావడానికి దేవుడు అనుమతించాడు.
- __13:12__అయితే మోషే వారికొరకు ప్రార్థించాడు, మరియు దేవుడు అతని ప్రార్థనను విన్నాడు, మరియు వారిని నాశనము చేయలేదు.
- __19:8__ఆ తరువాత బయలు ప్రవక్తలు “బయలు దేవత, మా ప్రార్థనలు ఆలకించు” అని బయలుకు ప్రార్థించారు .
- __21:7__యాజకులు కూడా ప్రజల కొరకు దేవుని ప్రార్థించారు.
- __38:11__వారు శోధనలోనికి వెళ్ళకుండునట్లు ప్రార్థన చేయమని యేసు తన శిష్యులకు చెప్పాడు.
- 43:13 శిష్యులు అపొస్తలుల బోధను నిరంతరం వింటూ ఉన్నారు, అందరు కలసి సమయాన్ని గడిపారు, కలసి భోజనము చేశారు, మరియు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసారు.
- __49:18__ఇతర క్రైస్తవులతో కలిసి ప్రార్థించాలని, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని, ఆరాధన చేయాలని, మరియు ఆయన మీకోసం చేసినదానికి ఇతరులకు చెప్పాలని దేవుడు మీతో చెపుతున్నాడు.
పదం సమాచారం:
- Strong’s: H0559, H0577, H1156, H2470, H3863, H3908, H4994, H6279, H6293, H6419, H6739, H7592, H7878, H7879, H7881, H8034, H8605, G01540, G11620, G11890, G17830, G20650, G21710, G21720, G38700, G43350, G43360