te_tw/bible/other/praise.md

5.2 KiB
Raw Permalink Blame History

స్తుతి, స్తుతించెను, స్తుతికి అర్హుడు

నిర్వచనము:

ఎవరినైనా స్తుతించాలంటే ఆ వ్యక్తి కొరకు గౌరవమును మరియు ప్రశంసలను వ్యక్తపరచాలి.

  • దేవుని గొప్పతనమునుబట్టి ప్రజలందరు దేవునిని స్తుతిస్తారు మరియు లోక రక్షకునిగాను, సృష్టికర్తగాను ఆయన చేసిన అద్భుత కార్యములనుబట్టి ఆయనను స్తుతిస్తారు.
  • దేవుని కొరకైన స్తుతిలో అనేకమార్లు ఆయన చేసిన కార్యముల కొరకు కృతజ్ఞతలు చెల్లించుటయనునది ఉండును.
  • సంగీతము మరియు పాటలు పాడుట అనునది అనేకమార్లు దేవునిని స్తుతించు విదానముగా పరిగణించబడును.
  • దేవునిని ఆరాధించుట అనునది ఆయనను స్తుతించుటయను అర్థములో భాగమునైయున్నది.
  • “స్తుతి” అనే పదమును “మంచిగా మాట్లాడు” లేక “మాటలతో గొప్పగా ఉన్నతంగా ఘనపరచు” లేక “మంచి విషయములు పలుకు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “స్తుతి” అనే నామపదమును “ఘనముగా మాట్లాడు” లేక “ఘనపరిచే విధముగా మాట్లాడు” లేక “మంచి విషయములను చెప్పి మాట్లాడు” అని తర్జుమా చేయవచ్చును.

(చూడండి: worship)

బైబిలు రిఫరెన్సులు:

బైబిల్ కథలనుండి ఉదాహరణలు:

  • 12:13 ఇశ్రాయేలీయులు దేవునిని స్తుతించుటకు మరియు వారి క్రొత్త స్వాతంత్ర్యమును ఆచరించుటకు అనేకమైన పాటలు పాడిరి, ఎందుకంటే దేవుడు వారిని ఐగుప్తు సైన్యమునుండి రక్షించెను.
  • __17:8__దావీదు ఈ మాటలు వినినప్పుడు, అతను తక్షణమే దేవునిని స్తుతించి, కృతజ్ఞతలు తెలియజేసెను, ఎందుకంటే ఇటువంటి ఘనతను మరియు అనేక ఆశీర్వాదములను ఇస్తానని దేవుడు దావీదుకు వాగ్ధానము చేసియుండెను.
  • 22:7“దేవుని స్తుతించుడి, ఎందుకనిన ఆయన తన ప్రజలను జ్ఞాపకము చేసికొనెను” అని జెకర్యా చెప్పెను!
  • 43:13 వారందరు (శిష్యులు) కూడి దేవుని స్తుతించుటలో సంతోషించిరి మరియు వారితోనున్న సమస్తము వారిలో ఒకరితో ఒకరు పంచుకొనిరి.
  • __47:8__వారు పౌలు మరియు సీలను చెరలో ఎక్కువ భద్రత కలిగిన భాగమందు ఉంచిరి మరియు వారి కాళ్ళను బంధించిరి. అయినను మధ్యరాత్రియందు, వారు పాటలు పాడుచు దేవునిని స్తుతించిరి .

పదం సమాచారం:

  • Strongs: H1319, H7121, H8416, G29800, G38530