te_tw/bible/kt/forgive.md

7.0 KiB

క్షమించడం, క్షమించబడిన, క్షమాపణ, క్షమాపణ పొందిన

నిర్వచనం:

ఎవరినైనా క్షమించడం అంటే ఎవరైనా తనకు గాయం కలిగించినా వారికి వ్యతిరేకంగా ఎలాంటి కక్ష పెట్టుకోకుండా ఉండడం. "క్షమాపణ" అంటే ఎవరినైనా మన్నించే క్రియ.

  • ఎవరినైనా క్షమించడం అంటే ఆ మనిషిని అతడు చేసిన తప్పు నిమిత్తం శిక్షించక పోవడం.
  • పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. "రద్దు చేయడం," " అప్పు క్షమించడం."
  • మనుషులు వారి పాపాలు ఒప్పుకుంటే దేవుడు సిలువపై యేసు త్యాగ పూర్వక మరణం ద్వారా క్షమిస్తాడు.
  • తాను వారిని క్షమించిన విధంగానే తన శిష్యులు ఇతరులను క్షమించాలని యేసు బోధించారు.

"క్షమాపణ" అంటే క్షమించడం. ఎవరినైనా అతని పాపంకోసం శిక్షించక పోవడం.

  • "క్షమాభిక్ష" పెట్టడం అంటే "క్షమించు" అనే అర్థమే గానీ అదనంగా అతని అపరాధం విషయంలో శిక్షించకూడదని నిర్ణయం చేయడం అనే ప్రత్యేకర్థం ఉంది.
  • న్యాయ స్థానం న్యాయాధిపతి ఒక వ్యక్తి నేరం చేసాడని రుజువైనా క్షమాభిక్ష పెట్టవచ్చు.
  • మనుషులు పాపం చేసినా యేసు క్రీస్తు మనలను క్షమించి నరకం నుండి తప్పించాడు. ఇది తన త్యాగ పూర్వక సిలువ మరణం మూలంగా సాధ్యం అయ్యింది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "క్షమించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "క్షమాభిక్ష” లేక “శిక్ష రద్దు” లేక “విడుదల” లేక “ఆ వ్యక్తికి అతని నేరాన్ని వ్యతిరేకంగా నిలపక పోవడం" (ఎవరినైనా).
  • "క్షమాపణ" అనే దాన్ని ఒక పదంతో అనువదించ వచ్చు లేక ఒక పదబంధంతో. "మనసులో కక్ష పెట్టుకోక పోవడం” లేక “(ఎవరినైనా) దోషి కాదని ప్రకటించడం” లేక “క్షమాభిక్ష పెట్టే క్రియ."
  • మీ భాషలో ఒక పదం క్షమించడం అని అర్థం ఇచ్చే పదం ఉంటే "క్షమాభిక్ష" అని అర్థం వచ్చేలా ప్రయోగించ వచ్చు. (చూడండి: అపరాధ భావం)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • __7:10__అయితే ఏశావు అప్పటికే యాకోబును క్షమించాడు. వారు ఒకరినొకరు మరలా చూసుకుని ఆనందించారు.
  • __13:15__తరువాత మోషే కొండ ఎక్కి మరలా దేవుడు ప్రజలను క్షమించాలని ప్రార్థించాడు. దేవుడు మోషే ప్రార్థన విన్నాడు, వారిని క్షమించాడు.
  • __17:13__దావీదు తన పాపం విషయం పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు.
  • 21:5 కొత్త నిబంధనలో, దేవుడు తన చట్టం మనుషుల హృదయాలపై రాశాడు. ప్రజలు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుదురు, వారు అయన ప్రజలు, దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు.
  • __29:1__ఒక రోజు పేతురు యేసును ఇలా అడిగాడు. "స్వామీ నేను నా సోదరుడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ సోదరుణ్ణి ఎన్ని సార్లు క్షమించాలి?
  • __29:8__నీవు నన్ను అర్థించావు గనుక నేను నీ రుణం క్షమించాను.
  • __38:5__తరువాత యేసు పాత్ర తీసుకుని చెప్పాడు, "ఇది తాగండి. ఇది నా రక్తం మూలంగా ఉన్న కొత్త నిబంధన. దీన్ని పాపాల క్షమాపణ కోసం ధారపోశాను.

పదం సమాచారం:

  • strongs:H5546, H5547, H3722, H5375, H5545, H5547, H7521, G859, G863, G5483