te_tw/bible/kt/altar.md

3.4 KiB
Raw Permalink Blame History

బలిపీఠం

నిర్వచనం:

బలిపీఠం అంటే ఎత్తుగా కట్టిన వేదిక. ఇశ్రాయేలీయులు జంతువులను ధాన్యాన్ని దేవునికి బలిగా దహించడానికి దీనిని ఉపయోగిస్తారు.

  • బైబిల్ కాలాల్లో, మామూలు బలిపీఠాలను తరచుగా తడిపిన మట్టిని కుప్పగా పోయడం ద్వారా గానీ, కొన్ని రాళ్ళను ఒకదానిపై ఒకటి జాగ్రత్తగా పేర్చి నిలబెట్టడం ద్వారా గానీ నిర్మిస్తారు.
  • కొన్ని ప్రత్యేక పెట్టె ఆకారపు బలిపీఠాలు కూడా కట్టారు. వాటిపై బంగారం, ఇత్తడి, లేక కంచు వంటి లోహాలను తాపడం చేసేవారు.
  • ఇశ్రాయేలీయుల పరిసరాల్లో నివసించే ఇతర ప్రజలు కూడా వారి దేవుళ్ళకు బలి అర్పణలు చెయ్యడానికి బలిపీఠాలు నిర్మించే వారు.

(చూడండి: altar of incense, false god, grain offering, sacrifice)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 03:14 నోవహు ఓడ నుండి బయటికి వచ్చి బలిపీఠం నిర్మించి అర్పించ దగిన కొన్ని రకాల జంతువులను బలి అర్పణ చేసాడు.
  • 05:08 వారు బలి అర్పణ స్థలానికి చేరుకున్నప్పుడు, అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు చేతులు కట్టి అతణ్ణి బలిపీఠం పై ఉంచాడు.
  • 13:09 యాజకుడు జంతువును వధించి దాన్ని బలిపీఠం పై దహించి వేసే వాడు.
  • 16:06 అతడు (గిద్యోను) ఒక కొత్త బలిపీఠం కట్టి దాన్ని దేవునికి ప్రతిష్టించాడు. విగ్రహం కోసం వాడిన బలిపీఠం పై అతడు దేవునికి బలి అర్పణ చేసాడు.

పదం సమాచారం:

  • Strongs: H0741, H2025, H4056, H4196, G10410, G23790