te_tw/bible/kt/arkofthecovenant.md

3.0 KiB

నిబంధన మందసం, యెహోవా మందసం

నిర్వచనం:

ఈ పదాలు ప్రత్యేకమైన కొయ్యతో చేసి బంగారం రేకుతో కప్పిన పెట్టెను సూచించేవి. ఇందులో పది ఆజ్ఞలు రెండు రాతి పలకలు ఉన్నాయి. అందులో అహరోను కర్ర,, మన్నా ఉంచిన గిన్నె ఉన్నాయి.

  • ఈ పదం "మందసం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పెట్టె” లేక “మంజూష” లేక “కంటైనర్."
  • అందులో ఉన్న వస్తువులు ఇశ్రాయేలీయులకు తమతో దేవుని నిబంధనను గుర్తు చేస్తాయి.
  • నిబంధన మందసం "అతి పరిశుద్ధ స్థలం"లో ఉంది.
  • ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి నిబంధన మందసం ఉంది. అక్కడ అయన ఇశ్రాయేలీయుల కోసం మోషేతో మాట్లాడాడు.
  • నిబంధన మందసం ఆలయం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సమయంలో ప్రధాన యాజకుడు మాత్రమే మందసాన్ని ఏడాదికి ఒక్కసారి ప్రాయశ్చిత్త దినాన సమీపించ వచ్చు.
  • అనేక అంగ్ల అనువాదాలు "నిబంధన ఆదేశాలు"అనే దాన్ని అక్షరాలా "సాక్షము"అని తర్జుమా చేసాయి. ఎందుకంటే పది ఆజ్ఞలు అనేవి తన ప్రజలతో దేవుని నిబంధన సాక్షము. దీన్ని "నిబంధన చట్టం"అని కూడా తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: మందసం, నిబంధన, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధ స్థలం, సాక్షము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H727, H1285, H3068