te_tw/bible/kt/testimony.md

11 KiB
Raw Permalink Blame History

సాక్షం, సాక్షమివ్వడం, సాక్షి, ప్రత్యక్ష సాక్షి

నిర్వచనం:

ఒక వ్యక్తి "సాక్షం" ఇచ్చినప్పుడు తనకు తెలిసిన దానిని గురించి ఒక ప్రకటన చేస్తున్నాడు, తన ప్రకటన వాస్తవం అని తెలియచేస్తున్నాడు. "సాక్ష్యం ఇవ్వడం" అంటే సాక్ష్యం చెప్పడమే.

  • తరచుగా ఒక వ్యక్తి తాను నేరుగా అనుభవించిన దాని గురించి "సాక్ష్యం ఇస్తాడు."
  • "అబద్ధసాక్షం" ఇచ్చే వాడు జరిగిన దానిని గురించి సత్యం చెప్పడం లేదు.
  • కొన్నిసార్లు "సాక్ష్యం" పదం ఒక ప్రవక్త ప్రవచించే దానిని సూచిస్తుంది.
  • కొత్త నిబంధనలో, ఈ పదం తరచుగా యేసు అనుచరులు యేసు జీవితం, మరణం, పునరుత్థానం గురించిన సంఘటనలను గురించి సాక్ష్యం ఇవ్వడానిని సూచిస్తుంది.

"సాక్షి" పదం జరిగిన దానిని వ్యక్తిగతంగా అనుభవించిన వ్యక్తిని సూచిస్తుంది. సాధారణంగా సాక్షి అంటే తమకు తెలిసినది వాస్తవం అని సాక్ష్యం ఇచ్చేవాడని అర్థం. "ప్రత్యక్ష సాక్షి" పదం వాస్తవానికి అక్కడ ఉన్నాడని, జరిగినదానిని చూచాడని నొక్కి చెపుతుంది.

  • ఒక దానిని గురించి "సాక్ష్యం ఇవ్వడం" అంటే అది జరగడానిని చూడడం అని అర్థం.
  • న్యాయ విచారణలో సాక్షి "సాక్ష్యాన్ని ఇస్తాడు" లేదా "సాక్షాన్ని కలిగియుంటాడు."
  • సాక్షులు తాము చూసిన దానినీ, వినిన దానిని గురించిన సత్యాన్ని గురించి చెప్పవలసి ఉన్నారు.
  • జరిగిన దాని గురించి సత్యం చెప్పని సాక్షి "అబద్ధసాక్షి" అని పిలువబడతాడు. అతడు "అబద్ధసాక్షం ఇచ్చాడు” లేదా “అబద్ధ సాక్షం కలిగియున్నాడు" అని అతని గురించి చెప్పవచ్చు.
  • "ఇద్దరి మధ్య సాక్షిగా ఉండు" అంటే ఒక ఒప్పందం చెయ్యబడినదానికి రుజువుగా ఉండే వస్తువు లేదా వ్యక్తి అని అర్థం. ప్రతి ఒక్కరూ చెయ్యడానికి వాగ్దానం చేసినదానిని వారు చేసేలా సాక్షి చూస్తాడు.

అనువాదం సూచనలు:

·         "సాక్షమివ్వడం” లేదా “సాక్షం చెప్పడం" పదం “వాస్తవాలు చెప్పడం" లేదా "చూచినదానిని, వినిన దానిని చెప్పడం" లేదా "వ్యక్తిగత అనుభవం నుండి చెప్పడం” లేదా "రుజువు ఇవ్వడం" లేదా "జరిగిన దానిని చెప్పడం" అని అనువదించబడవచ్చు.

·         "సాక్షం" పదం "జరిగిన దానిని నివేదించడం" లేదా "వాస్తవాన్ని గురించిన ప్రకటన" లేదా "రుజువు" లేదా "చెప్పబడిన దానిని" లేదా "ప్రవచనం" అని వివిధ రీతులలో అనువదించబడవచ్చు.

·         "వారికి సాక్ష్యం వలే" పదబంధం "సత్యం అయిన దానిని చూపించడం" లేదా "సత్యమైన దానిని వారికి రుజువు పరచడం" అని అనువదించబడవచ్చు.

·         "వారికి వ్యతిరేకంగా సాక్షం ఇవ్వడంవలే" పదబంధం "వారి పాపాన్ని వారికి చూపించేది" లేదా "వారి వేషధారణను బయలు పెట్టడం" లేదా "వారు తప్పు అని రుజువు చేసేది" అని అనువదించబడవచ్చు. * "అబద్ధసాక్షం ఇవ్వడం" అనే వాక్యం "ఒక విషయం గురించి చెడు సంగతులు చెప్పడం" లేదా సత్యం కాని సంగతులను ప్రకటించడం" అని అనువదించబడవచ్చు.

·         "సాక్షి" లేదా “ప్రత్యక్ష సాక్షి" పదం "ఒక వ్యక్తి చూడడం" లేయా "అది జరగడం చూచిన వ్యక్తి" లేదా "(ఆ సంగతులను) చూచిన వారు, వినిన వారు" అని అర్థం ఇచ్చే పదం లేదా పదబంధంతో అనువదించబడవచ్చు.

·         "ఒక సాక్షి" పదం "నిశ్చితం" లేదా "మన వాగ్దానానికి గురుతు" లేదా "అది సత్యం అని సాక్ష్యం ఇచ్చేది" అని అనువదించబడవచ్చు.

·         "మీరు నాకు సాక్షులు" వాక్యం "మీరు ఇతరులకు నాగురించి చెపుతారు” లేదా "నేను మీకు బోధించిన సత్యాలను మీరు ఇతరులకు బోధిస్తారు" లేదా "మీరు చూసిన నా క్రియలు, నేను బోధించగా వినిన సంగతులు ప్రజలకు మీరు చెపుతారు" అని అనువదించబడవచ్చు.

·         "సాక్షం ఇవ్వడం" పదం "చూసిన దానిని చెప్పడం" లేదా “సాక్షమివ్వడం” లేదా "జరిగిన దానిని చెప్పడం" అని అనువదించబడవచ్చు.

·         ఒక దానికోసం "సాక్షిగా ఉండడం" పదబంధం "ఒక దానిని చూడడం" లేదా "జరిగిన దానిని అనుభవించడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: ark of the covenant, guilt, judge, prophet, testimony, true)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __39:2__ఇటిలోపల యూదునాయకులు యేసును న్యాయ విచారణకు నిలబెట్టారు. వారు అనేక మంది అబద్ధసాక్షులను తీసుకొనివచ్చారు. వారాయనను గురించి అబద్ధాలు చెప్పారు.
  • 39:4 ప్రధాన యాజకుడు తన వస్త్రాలను కోపంగా చింపుకుని గట్టిగా అరిచాడు. "మనకు ఇక వేరే సాక్షులతో పనేముంది? తాను దేవుని కుమారుడు అని అతడు చెప్పడం మీరు విన్నారు గదా. మీ తీర్పు ఏమిటి ?"
  • 42:8"లేఖనాల్లో కూడా రాసి ఉంది, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడి వారి పాపాలకు క్షమాపణ పొందాలని నా శిష్యులు ప్రకటిస్తారు. వారు యెరూషలేములో మొదలు పెట్టి, తరువాత అన్ని ప్రజలు సమూహాలకూ ప్రకటిస్తారు. మీరు వీటికి సాక్షులు."
  • 43:7 " దేవుడు యేసును మరలా సజీవుడుగా లేపాడు జీవం అనే సత్యానికి మేము సాక్షులం."

పదం సమాచారం:

  • Strongs: H5707, H5713, H5715, H5749, H6030, H8584, G02670, G12630, G19570, G26490, G31400, G31410, G31420, G31430, G31440, G43030, G48280, G49010, G55750, G55760, G55770, G60200