te_tw/bible/kt/guilt.md

3.6 KiB

అపరాధ భావం, దోషం

నిర్వచనం:

"అపరాధ భావం" అంటే వాస్తవంగా పాపం చేసినప్పుడు కలిగే మనో వేదన.

  • "దోష భావం" నైతికంగా ఏదైనా తప్పు, అంటే దేవునికి లోబడని పని చేస్తే కలిగే భావం.
  • "అపరాధ భావం" అనే దానికి వ్యతిరేకం "నిర్దోషత్వం."

అనువాదం సలహాలు:

  • కొన్ని భాషల్లో దీన్ని అనువదించడం “పాప భారం” లేక “పాపాల లెక్క."
  • “దోషం” అంటే "తప్పు చేసిన ఒప్పుదల” లేక “నైతికంగా తప్పు చేసిన స్థితి” లేక “పాపం చేత కట్టుబడిపోవడం."

(చూడండి: innocent, iniquity, punish, sin)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 39:02 వారు అనేక సాక్షులను తెచ్చారు. వారు ఆయన్ను గురించి అబద్ధాలు చెప్పారు. అయితే, వారి మాటలు ఒకరితో ఒకరికి పొసగకపోవడం చేత యూదు నాయకులు అయన దోషి అని రుజువు చెయ్యలేక పోయారు.
  • 39:11 యేసుతో మాట్లాడడం ముగించాక పిలాతు బయటికి పోయి ప్రజలతో చెప్పాడు, "ఇతనిలో ఏ దోషం నాకు కనబడలేదు." అయితే యూదు నాయకులు, గుంపు అరిచారు, "అతన్ని సిలువ వెయ్యి!" పిలాతు ఇలా జవాబిచ్చాడు, "అతడు ఏ అపరాధం చేశాడు?" అయితే వారు మరీ పెద్దగా కేకలు వేశారు. తరువాత పిలాతు మూడవ సారి చెప్పాడు. "అతడు నిర్దోషి!"
  • 40:04 యేసు ఇద్దరు దోపిడీ దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. వారిలో ఒకడు యేసును హేళన చేశాడు. అయితే మరొకడు ఇలా చెప్పాడు, "నీవు దేవునికి భయపడవా? మనం దోషులం, అయితే ఈ మనిషి నిర్దోష.
  • 49:10 ఎందుకంటే నీ పాపం, నీ అపరాధం కోసం నీవు చనిపోవడం న్యాయమే.

పదం సమాచారం:

  • Strong's: H816, H817, H818, H5352, H5355, G338, G1777, G3784, G5267