te_tw/bible/kt/innocent.md

5.2 KiB

నిర్దోషమైన

నిర్వచనం:

"నిర్దోష" నేరం చేసిన, ఇతరత్రా తప్పు చేసిన అపరాధ భావం లేని స్థితి. ఇది సాధారణంగా చెడుకార్యాలు చెయ్యని మనుషులకు వర్తిస్తుంది.

  • ఒక వ్యక్తి ఏదైనా చేసినట్టు నేరం మోపబడితే అతడు ఆ తప్పు చెయ్యలేదని తేలితే అతడు నిర్దోషి.
  • కొన్ని సార్లు "నిర్దోష" అనే పదాన్ని ఏ తప్పు చేయని వారికి తమకు జరుగుతున్నది అన్యాయం అయినప్పుడు వాడతారు. ఉదాహరణకు శత్రు సైన్యం "నిర్దోష ప్రజలపై" దాడి చేసినప్పుడు.

అనువాదం సూచనలు:

  • ఎక్కువ సందర్భాల్లో "నిర్దోష" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "అపరాధ భావం లేని” లేక “బాధ్యుడు కాని” లేక “ఆరోపణకు తగని."
  • సాధారణంగా నిర్దోష ప్రజలకు అన్వయించినప్పుడు ఈ పదాన్నిఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తప్పులేని వాడు” లేక “ఎలాటి దుష్టత్వంలో భాగం లేని."
  • "నిర్దోష రక్తం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరణ శిక్షకు తగిన నేరమేదీ చెయ్యని."
  • "నిర్దోష రక్తం ఒలికించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిర్దోషులను చంపు” లేక “ఏ తప్పు చేయని వారిని చంపడం."
  • సందర్భంలో ఎవరినైనా చంపినప్పుడు, "నిర్దోష రక్తం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరణపాత్రుడు కాని."
  • యేసును గురించిన సువార్తను వినని కారణంగా "అపరాధం విషయంలో నిర్దోషి" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆత్మ సంబంధమైన మృతస్థితిలో ఉన్నదానికి బాధ్యులు కారు” లేక “వారు సందేశం అంగీకరించనందుకు బాధ్యులు కారు."
  • యూదా "నేను నిర్దోష రక్తం విషయంలో ద్రోహం చేశాను," అన్నప్పుడు అతడు "ఏ తప్పు చెయ్యని మనిషికి ద్రోహం చేశాను” అంటున్నాడు. లేక “దోషం లేని మనిషి మరణం పొందేలా చేశాను."
  • యేసును గురించి పిలాతు "నేను నిర్దోషి రక్తం విషయంలో నిర్దోషని" అన్న దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఏ తప్పు చేయని ఈ మనిషి మరణంలో నాకు ఏ బాధ్యతా లేదు."

(చూడండి: [అపరాధ భావం]) guilt

బైబిల్ రిఫరెన్సులు:

  • [1 కొరింతి 04:3-4]
  • [1 సమూయేలు 19:4-5]
  • [అపో. కా. 20:25-27]
  • [నిర్గమ 23:6-9]
  • [యిర్మీయా 22:17-19]
  • [యోబు 09:21-24]
  • [రోమా 16:17-18]

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • [08:06] తరువాత రెండు సంవత్సరాల వరకు, అతడు నిర్దోషి అయినప్పటికీ యోసేపు ఇంకా చెరసాలలో ఉన్నాడు.
  • [40:04] వారిలో ఒకడు యేసును హేళన చేశాడు. అయితే మరొకడు "నీకు దేవుని భయం లేదా?” అన్నాడు. దోషులం, అయితే ఈ మనిషి నిర్దోషి."
  • [40:08] యేసుకు కాపలా ఉన్న సైనికుడు అక్కడ సంభవిస్తున్నదంతా చూసి "తప్పనిసరిగా, ఈ మనిషి నిర్దోషి. అతడు దేవుని కుమారుడు" అన్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121