te_tw/bible/kt/true.md

9.4 KiB
Raw Permalink Blame History

నిజము, సత్యం

నిర్వచనం:

"సత్యం" అనే పదం  వాస్తవాలనూ, సంఘటనలనూ, వాస్తవానికి సంబంధించిన ప్రకటనలనూ సూచిస్తుంది. నిజమైన (సత్యమైన) వాస్తవాలు విశ్వం నిజంగా ఉందని వివరిస్తుంది. సత్యమైన సంఘటనలు వాస్తవంగా జరిగిన సంఘటనలు. నిజమైన ప్రకటనలు వాస్తవ లోకం ప్రకారం అబద్దపు ప్రకటనలు కాదు.

  • "నిజమైన" సంగతులు నిజమైనవి, యదార్ధమైనవి, అసలైనవి, న్యాయబద్ధమైనవి, వాస్తవమైనవి.
  • సత్యం అంటే సత్యం అయిన అవగాహనలు, నమ్మకాలు, వాస్తవాలు లేదా ప్రకటనలు.
  • ప్రవచనం "నెరవేరింది” లేదా “జరుగుతుంది" అంటే అది ముందుగానే చెప్పినట్టుగా నిజంగా జరిగింది లేదా ఆ విధంగా జరుగుతుంది అని అర్థం.
  • బైబిలులో "సత్యం" విషయమైన భావనలో ఆధారపడదగిన, లేక విశ్వసనీయ విధానంలో చెయ్యడం గురించిన భావన ఉంది.
  • యేసు చెప్పిన మాటలలో దేవుని సత్యం వెల్లడయింది.
  • బైబిలు సత్యమై ఉంది. ఇది దేవునిని గూర్చిన  సత్యమైన దానిని బోధిస్తుంది. ఆయన చేసిన సమస్తాన్ని గురించి బోధిస్తుంది.

అనువాదపు సూచనలు:

  • సందర్బానుసారంగా వివరిస్తున్న వాటిని బట్టి, “నిజమైన” అనే పదాన్ని “నిజమైన” లేదా “వాస్తవికమైన” లేదా “సరైన” లేదా “ఖచ్చితమైన” లేదా “సత్యమైన” లేదా “రూడియైన” అని కూడా అనువదించవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, వివరించిన దానిని బట్టి "సత్యం" అనే పదం  "నిజమైన" లేదా "వాస్తవమైన" లేదా సరియైన" లేదా "నిశ్చితమైన" లేదా "యదార్ధమైన" అని అనువదించవచ్చు.
  • "సత్యం" అనే పదం  "సత్యమైనది" లేదా "వాస్తవం" లేదా "నిశ్చయం" లేదా "వాస్తవం" అని ఇతర విధాలుగా అనువదించవచ్చు.
  • "నెరవేరింది" అనే పదబంధం "నిజంగా జరిగింది" లేదా "నెరవేరుతుంది" లేదా "ఊహించినట్లుగా జరుగుతుంది" అని అనువదించవచ్చు.
  • "సత్యం చెప్పు" లేదా  "సత్యం మాట్లాడు" వాక్యాలు "సత్యం అయిన దానిని మాట్లాడు" లేదా "నిజంగా జరిగిన దానిని చెప్పు" లేదా "నమ్మదగిన వాటిని మాట్లాడు" అని అనువదించవచ్చు. * "సత్యం అంగీకరించు" వాక్యం "దేవుని గురించి సత్యం అయిన దానిని విశ్వసించు" అని అనువదించవచ్చు.
  • "దేవుణ్ణి ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించు" వాక్యంలో "సత్యంతో" అనే అనే పదం  "దేవుడు మనకు బోధించిన దానికి నమ్మకంగా విధేయత చూపించు" అని అనువదించవచ్చు.

(చూడండి:believe, faithful, fulfill, obey, prophet, understand)

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __2:4__సర్ప స్త్రీకి ఇలా జవాబిచ్చింది, "అది కాదు__నిజ__! మీరు చనిపోరు."
  • __14:6__వెటనే కాలేబు, యెహోషువా, అనే  ఇద్దరు గూఢచారులు, చెప్పారు, "అది  __నిజ__, కనాను వాసులు పొడవైన బలమైన వారు., అయితే మనం తప్పని సరిగా వారిని ఓడించగలం!"
  • 16:1

ఇశ్రాయేలీయులు __నిజ__ దేవుడైన యెహోవాకు బదులు కనానీయుల దేవుళ్ళను పూజించడం ఆరంభించారు.

*__31:8__వారు యేసును ఆరాధించారు, "__నిజముగా__ నీవు దేవుని కుమారుడవు" అన్నారు.

*39:10"నేను  దేవుణ్ణి గురించిన __సత్య__ చెప్పడానికి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే ప్రతి  ఒక్కరూ నా మాట వింటారు." పిలాతు అన్నాడు, "__సత్య__" అంటే ఏమిటి?"

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 02:04 సర్పం స్త్రీకి ఇలా జవాబిచ్చింది, "అది నిజం! మీరు చనిపోరు."
  • 14:06 వెంటనే కాలేబు, యెహోషువా, అనే ఇద్దరు గూఢచారులు, చెప్పారు, "అది నిజం, కనాను వాసులు పొడవైన బలమైన వారు., అయితే మనం తప్పనిసరిగా వారిని ఓడించగలం!"
  • 16:01 ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడు అయిన యెహోవాకు బదులు కనానీయుల దేవుళ్ళను పూజించడం ఆరంభించారు.
  • 31:08 వారు యేసును ఆరాధించారు, "నిజముగా నీవు దేవుని కుమారుడవు" అన్నారు.
  • 39:10 "నేను దేవుణ్ణి గురించిన సత్యం చెప్పడానికి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నా మాట వింటారు." పిలాతు అన్నాడు, "సత్యం" అంటే ఏమిటి?"

పదం సమాచారం:

  • Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137