te_tw/bible/kt/faithful.md

9.0 KiB
Raw Permalink Blame History

విశ్వసనీయ, విశ్వాస్యత, అవిశ్వసనీయ, అవిశ్వాస్యత, నమ్మదగిన

నిర్వచనం:

దేవుని పట్ల "విశ్వసనీయంగా" ఉండడం అంటే దేవుని ఉపదేశాల ప్రకారం స్థిరంగా జీవించడం అని అర్థం. ఆయనకు విధేయత చూపడం ద్వారా సద్భక్తి కలిగి ఉండడం అని అర్థం. విశ్వసనీయంగా ఉండడంలోని స్థితి లేక షరతు "విశ్వాస్యత" గా ఉంటుంది.

  • ఒక వ్యక్తి విశ్వసనీయంగా ఉండడం దేవుడు తన వాగ్దానం ఎప్పుడూ నిలబెట్టుకోడానికీ మరియు ఇతర ప్రజలకు ఎల్లప్పుడూ తన బాధ్యతలు నెరవేర్చడానికీ నమ్మదగిన వాడుగా ఉండడం.
  • ఒక విశ్వసనీయ వ్యక్తి ఒక కర్తవ్యాన్ని అది పెద్దదీ మరియు కష్టమైనదీ అయినా దానిని చెయ్యడంలో పట్టుదలతో ఉంటాడు.
  • దేవుని పట్ల విశ్వసనీయత అంటే దేవుడు మనలను చెయ్యమని కోరే దానిని స్థిరంగా చేస్తూ ఉండడం.

"అవిశ్వసనీయ" పదం అంటే దేవుడు వారికి అజ్ఞాపించిన వాటిని చెయ్యని ప్రజలను వర్ణిస్తుంది. అవిశ్వసనీయ స్థితి లేదా ఆచరణ "అవిశ్వాస్యత" గా ఉండడం అంటారు.

  • ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను పూజించడం ఆరంభించినప్పుడు మరియు ఇతర విషయాలలో దేవునికి అవిధేయత చూపినప్పుడు వారు "అవిశ్వసనీయులు" అని పిలువబడ్డారు.
  • దాంపత్యంలో వ్యభిచారం చేసిన వారు తన భార్యకు లేదా భర్తకు "అవిశ్వసనీయలు" గా ఉన్నారు.
  • దేవుడు ఇశ్రాయేలీయుల అవిధేయ ప్రవర్తనను వర్ణించడానికి "అవిశ్వాస్యత" పదాన్ని ఉపయోగించాడు. వారు దేవునికి విధేయత చూపించడం లేదు లేదా ఆయన ఘనపరచడం లేదు.

అనువాదం సూచనలు:

  • అనేక సందర్భాలలో, "విశ్వసనీయ" పదం "సద్భక్తితో ఉన్నవారు" లేదా "సమర్పించబడివారు" లేదా "ఆధారపడదగినవారు" అని అనువదించబడవచ్చు.
  • ఇతర సందర్భాలలో, "విశ్వసనీయ" పదం "విశ్వసించడానికి కొనసాగడం" లేదా "విశ్వసించడంలోనూ మరియు దేవునికి విధ్వయత చూపడంలో పట్టుదల కలిగియుండడం" అని అర్థం ఇచ్చే పదంతో అనువదించబడవచ్చు.
  • "విశ్వాస్యత" పదం "విశ్వసించడంలో పట్టుదల కలిగియుండడం" లేదా "సద్భక్తి" లేదా "ఆధారపడదగిన తత్వం" లేదా "దేవుణ్ణి విశ్వసించడం మరియు ఆయనకు విధేయత చూపించడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "అవిశ్వసనీయ" పదం "విశ్వసనీయులు కాదు" లేదా "విశ్వాసం ఉంచనివారు" లేదా "సద్భక్తి లేనివారు" అని అనువదించబడవచ్చు.
  • "అవిశ్వసనీయ" పదం "(దేవుని పట్ల) విశ్వాసనీయులు కానివారు" లేదా "అవిశ్వసనీయ ప్రజలు" లేదా "దేవునికి అవిధేయత చూపేవారు" లేదా "దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయు ప్రజలు" అని అనువదించబడవచ్చు.
  • "అపనమ్మకత్వం" పదం "అవిధేయత" లేదా "విశ్వాస ద్రోహం" లేదా "విశ్వసించకపోవడం, విధేయత చూపించకపోవడం" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని భాషలలో, "అవిశ్వసనీయ" పదం "అపనమ్మకం" కొరకైన పదంతో సంబంధపరచబడి ఉంటుంది.

(చూడండి:believe, faith, believe)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __8:5__చెరసాలలో సైతం యోసేపు దేవుని పట్ల విశ్వసనీయంగా కొనసాగాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
  • __14:12__అయినప్పటికీ, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తన వాగ్దానం విషయంలో విశ్వసనీయంగా ఉన్నాడు.
  • __15:13__దేవునికి విశ్వసనీయంగా ఉంటామని మరియు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రజలు దేవునికి వాగ్దానం చేశారు.
  • __17:9__దావీదు న్యాయంతో మరియు విశ్వసనీయతతో అనేక సంవత్సరాలు యేలుబడి చేశాడు మరియు దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అయితే అతని జీవితం ఆఖరు భాగంలో దావీదు దేవునికి వ్యతిరేకంగా ఘోరమైన పాపం చేశాడు.
  • 35:12  " పెద్ద కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు. 'ఈ సంవత్సరాలు అన్నీ నీ కోసం విశ్వసనీయంగా పని చేశాను!"
  • __49:17__అయితే దేవుడు విశ్వసనీయుడు మరియు నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు.
  • __50:4__అతము వరకూ నీవు నా పట్ల విశ్వసనీయంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు."

పదం సమాచారం:

  • Strongs: H0529, H0530, H0539, H0540, H0571, H0898, H2181, H4603, H4604, H4820, G05690, G05710, G41030