te_tw/bible/kt/faith.md

6.0 KiB
Raw Permalink Blame History

విశ్వాసం

నిర్వచనం:

సాధారణంగా, "విశ్వాసం" పదం ఒకరి మీద లేదా ఒకదాని మీద నమ్మకం, విశ్వాసం లేదా ధైర్యం ఉంచడాన్ని సూచిస్తుంది.

  • ఒకరియందు "విశ్వాసం కలిగియుండడం" అంటే అతడు చెప్పినదీ, అతడు చేసినదీ నిజం, నమ్మదగినది అని విశ్వసించడం.
  • "యేసునందు విశ్వాసం కలిగియుండడం" అంటే యేసును గురించి దేవుని బోధలు అన్నీ విశ్వసించడం. ముఖ్యంగా మనుష్యులు యేసులోనూ, వారి పాపం నుండి శుద్ధి చేయడానికీ, వారి పాపం కారణంగా వారు అర్హులైన శిక్షనుండి కాపాడడానికీ ఆయన బలి అర్పణలో విశ్వాస ముంచడం అని అర్థం.
  • యేసులో నిజమైన విశ్వాసం లేదా నమ్మకం ఒక వ్యక్తి మంచి ఆత్మ ఫలాలు లేదా ప్రవర్తనల కలిగిస్తాయి ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తూ ఉన్నాడు.
  • కొన్ని సార్లు "విశ్వాసం" అంటే సాధారణంగా "విశ్వాస సత్యాల" వ్యక్తీకరణగా యేసును గురించిన ఉపదేశాలన్నిటినీ సూచిస్తుంది.
  • "విశ్వాసం కాపాడుకోవడం” లేక “విశ్వాసం త్యజించడం" వంటి సందర్భాలలో "విశ్వాసం" పదం యేసు బోధల మీద నమ్మకం ఉంచే స్థితిని లేదా షరతును సూచిస్తున్నది.

అనువాదం సూచనలు:

  • కొన్ని సందర్భాలలో "విశ్వాసం" అనే పదం "నమ్మకం" లేదా "దృఢవిశ్వాసం" లేదా "నిబ్బరం" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని భాషలలో ఈ పదాలు "విశ్వసించు" అనే క్రియా రూపాలను ఉపయోగించి అనువదించబడతాయి. (చూడండి: భావనామాలు)
  • "విశ్వాసం ఉంచడం” వ్యాక్యం “యేసులో విశ్వాసం ఉంచుతూ ఉండడం” లేదా "యేసులో విశ్వసించడం కొనసాగించడం" అని అనువదించబడవచ్చు.
  • "వారు విశ్వాస సంబంధ లోతైన సత్యాలను గట్టిగా పట్టుకోవాలి" అనే వాక్యం "యేసు గురించి వారికి బోధించబడిన నిజమైన సంగతులు అన్నిటినీ విశ్వసిస్తూ ఉండాలి" అని అనువదించబడవచ్చు.
  • "విశ్వాసంలో నా నిజ కుమారుడు" అనే వాక్యం "అతడు నా కుమారుడు లాంటివాడు, ఎందుకంటే యేసులో విశ్వాసముంచడానికి నేను అతనికి బోధించాను" లేదా "యేసులో విశ్వాసముంచుతున్న నా నిజమైన ఆత్మీయ కుమారుడు" అని అనువదించబడవచ్చు.

(చూడండి:believe, faithful)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __5:6__ఇస్సాకు యువకుడుగా ఉన్నప్పుడు దేవుడు "నీ ఏకైక కుమారుడు ఇస్సాకును తీసుకుపోయి నాకు బలిగ అర్పించు" అని చెప్పడం ద్వారా అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాడు.
  • __31:7__అప్పుడు అయన (యేసు) పేతురుతో, "నీవు అల్ప విశ్వాసివి, ఎందుకు నీవు సందేహపడ్డావు?" అని అన్నాడు.
  • __32:16__యేసు ఆమెతో, "నీ విశ్వాసం నీకు స్వస్థత కలుగజేసింది, సమాధానంతో వెళ్ళు" అని చెప్పాడు.
  • 38:9

తరువాత యేసు పేతురుతో, "సాతాను మీ అందరినీ కోరుకొంటున్నాడు, అయితే పేతురూ, నీ విశ్వాసం విఫలం కాకూడదని నేను నీ కోసం ప్రార్థించాను" అని చెప్పాడు.

పదం సమాచారం:

  • Strongs: H0529, H0530, G16800, G36400, G41020, G60660