te_tw/bible/kt/atonement.md

3.2 KiB

ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం చేయు, ప్రాయశ్చిత్తాలు, ప్రాయశ్చిత్తం చేసి

నిర్వచనం:

పదాలు "ప్రాయశ్చిత్తం” “ప్రాయశ్చిత్తం" మనుషుల పాపాల పరిహారానికి దేవుడు ఒక బలి అర్పణ సిద్ధం చేసి పాపం పై తన ఆగ్రహం చల్లారే ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని సూచిస్తున్నాయి.

  • పాత నిబంధన కాలంలో, దేవుడు ఇశ్రాయేలీయులు పాపాలకు జంతు బలి అర్పణ రక్తం మూలంగా తాత్కాలిక ప్రాయశ్చిత్తం జరగడానికి అనుమతించాడు.
  • కొత్త నిబంధనలో రాసినట్టుగా, సిలువపై క్రీస్తు మరణం పాపానికి ఏకైక శాశ్వత ప్రాయశ్చిత్తం.
  • యేసు చనిపోయాక, మనుషులకు వారి పాపం మూలంగా రావలసిన శిక్ష రాకుండా తన త్యాగ పూర్వక మరణం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించాడు.

అనువాదం సలహాలు:

  • "ప్రాయశ్చిత్తం" అనే పదాన్ని ఒక పదం లేక పదబంధంతో అనువదించడం మంచిది."వెల చెల్లించు” లేక “దాని కోసం డబ్బు కట్టు” లేక “ఎవరి పాపాలైనా క్షమించబడేటందుకు” లేక “ఏదైనా నేరానికి పరిహారం"
  • "ప్రాయశ్చిత్తం"ఇలా అనువాదం చెయ్యవచ్చు "చెల్లింపు” లేక “పాప బలి అర్పణ వెల చెల్లించు” లేక “క్షమాపణ అనుగ్రహించు."
  • ఈ పదాన్నిడబ్బు చెల్లింపు అర్థం ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోండి.

(చూడండి: ప్రాయశ్చిత్తం మూత, క్షమించు, పరిహారం, సమాధాన పరచు, విమోచించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3722, H3725, G2643