te_tw/bible/kt/redeem.md

4.6 KiB

విమోచించు, విమోచకుడు, విమోచన

నిర్వచనము:

“విమోచించు” అనే పదం ఇంతకు ముందే బానిసత్వంలో లేదా మరొకరి హక్కుకింద ఉన్నదేనినైనా లేదా ఎవరినైనా తిరిగి కొనడాన్ని సూచిస్తుంది. "విమోచకుడు" అంటే దేనినైనా లేదా ఎవరినైనా విమోచించినవాడు అని అర్థం.

●        ప్రజలను లేక వస్తువులను ఏ విధముగా విమోచించాలనే దాని గురించి దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను ఇచ్చాడు. ఉదాహరణకు ఎవరైనా ఒకరు క్రయధనము చెల్లించుట ద్వారా బానిసత్వములోనున్న ఒక వ్యక్తిని విడిపించ వచ్చు తద్వారా ఆ బానిస స్వతంత్రుడవుతాడు. "క్రయధనం" పదం కూడా ఈ పద్దతిని సూచిస్తుంది. *

●        ఒకరి భూమి అమ్మబడినట్లయితే, ఆ వ్యక్తి యొక్క బందువు ఆ భూమిని “విమోచించవచ్చు” లేదా “తిరిగి కొనవచ్చు”, తద్వారా అది కుటుంబములోనే ఉండిపోతుంది.

●        ఇటువంటి పద్ధతులు  పాప బంధకములలో ఉన్న ప్రజలను దేవుడు ఏ విధంగా విమోచిస్తాడో చూపిస్తాయి. యేసు సిలువ మీద చనిపోయినప్పుడు, ప్రజల పాపాలన్నిటి కోసం పూర్తి వెల చెల్లించాడు. రక్షణ కోసం ఆయనయందు విశ్వాసముంచినవారందరిని విమోచించాడు. దేవుని ద్వారా విమోచించబడిన ప్రజలందరూ పాపమునుండీ, దాని శిక్షనుండీ విడిపించబడి, స్వతంత్రులయ్యారు.

అనువాదం సూచనలు:

●        సందర్భాన్ని బట్టి, “విమోచించు” పదం “తిరిగి కొనడం" లేదా "విడిపించుటకు (ఎవరినైనా) చెల్లించుట" అని అనువదించబడవచ్చు.

●        “విమోచన”అనే పదం “క్రయధనం" లేదా "స్వేచ్చ కోసం చెల్లింపు" లేదా "తిరిగి కొనడం " అని అనువదించబడవచ్చు.

●        “క్రయధనం, " “విమోచించు” అనే పదాలు ప్రాథమికంగా ఒకే అర్థాన్ని కలిగియున్నాయి. కాబట్టి కొన్ని భాషలు ఈ పదాల అనువాదం కోసం ఒకే పదాన్ని కలిగియుంటాయి. అయితే "క్రయధనం" దేనినైనా లేదా ఎవరినైనా "విమోచించడానికి" అవసరమైన చెల్లింపు అని కూడా అర్థం. "విమోచించు" పదం వాస్తవంగా చెల్లించవలసిన దానిని ఎప్పటికీ సూచించదు.

(చూడండి:free, ransom)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

●        Strong's: H1350, H1353, H6299, H6302, H6304, H6306, H6561, H7069, G00590, G06290, G18050, G30840, G30850