te_tw/bible/kt/ransom.md

4.9 KiB

ఖరీదు, ఖరీదు చెల్లించబడెను

నిర్వచనము:

“ఖరీదు” అనే ఈ పదము ఒక డబ్బు మొత్తమును లేక అడగబడినంత మొత్తమును లేక చెరలోనున్న వ్యక్తి విడుదల పొందుట కొరకు చెల్లించవలసిన రుసుమును సూచిస్తుంది.

  • క్రియా పదముగా, “ఖరీదు” అనే పదమునకు వెల చెల్లించుట లేక బంధించబడిన, చెరగొనిపోయినవారిని, బానిసలైనవారిని రక్షించు క్రమములో త్యాగపూరితమైన పనిని చేయుట అని అర్థము. “వెనక్కి వచ్చునట్లు కొనుగోలు చేయు” అనే ఈ మాటకు అర్థము “విమోచించు” అనే పదమునకు అనే అర్థము కూడా ఒక్కటే.
  • పాపపు బానిసత్వములోనున్న ప్రజలను విడిపించుటకు క్రయధనముగా లేక ఖరీదుగా యేసు తన్నతాను మరణమునకు అప్పగించుకొనెను. వారి పాపముల కొరకు ఖరీదును చెల్లించుట ద్వారా తన ప్రజలను వెనక్కి కొనుక్కొను దేవుని ఈ కార్యమును పరిశుద్ధ గ్రంథములో “విమోచన” అని పిలువబడింది.

తర్జుమా సలహాలు:

  • “ఖరీదు” అనే ఈ పదమును “విమోచించుటకు చెల్లించుట” లేక “విడుదల చేయుటకు వెలను చెల్లించుట” లేక “వెనక్కి తిరిగి కొనుగోలు చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఖరీదును (క్రయధనమును) చెల్లించుట” అనే ఈ మాటను “(స్వాతంత్ర్యమును అనుగ్రహించుటకు) వెలను చెల్లించుట” లేక “(ప్రజలను విడుదల చేయుటకు) దండమును చెల్లించుట లేక “అవసరమైన వెలను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఖరీదు లేక క్రయధనము” అనే ఈ నామపదమును “వెనక్కి తిరిగి కొనుగోలు చేయుట” లేక “క్రయధనమును చెల్లించుట” లేక “(భూమినిగాని లేక ప్రజలను గాని వెనక్కి తిరిగి కొనుక్కొనుటకు) వెలను చెల్లించుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఖరీదు (లేక క్రయధనము) మరియు “విమోచన” అనే ఈ పదములకు ఆంగ్ల భాషలో ఒకే అర్థము కలదు గాని కొన్నిమార్లు వేరొక భాషలలో కొంచెము విభిన్నమైన పదాలను ఉపయొగిస్తూ ఉంటారు. ఈ ఉద్దేశము కొరకు కొన్ని ఇతర భాషలలో ఒకే ఒక్క పదమును మాత్రమే ఉపయోగిస్తుంటారు.
  • ఈ పదమును “ప్రాయశ్చిత్తం” అనే పదమునుకు విభిన్నముగా తర్జుమా చేయునట్లు చూసుకోండి.

(ఈ పదములను కూడా చూడండి: ప్రాయశ్చిత్తం, విమోచించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1350, H3724, H6299, H6306, G487, G3083