te_tw/bible/names/sinai.md

3.3 KiB

సీనాయి, సీనాయి పర్వతము

వాస్తవాలు:

సీనాయి పర్వతము బహుశః ఇప్పుడు సీనాయి పెనిన్సులా అని పిలువబడే దక్షిణ భాగములో కనబడే ఒక కొండ. దీనికి “హోరేబు పర్వతము” అని కూడా పేరు.

  • సీనాయి పర్వతము అనేది రాతి ఎడారిలో ఒక పెద్ద భాగమైయున్నది.
  • ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వాగ్ధాన భూమికి ప్రయాణము చెస్తూ వస్తున్నప్పుడు సీనాయి పర్వతము దగ్గరికి వచ్చియుండిరి.
  • దేవుడు మోషేకు సీనాయి పర్వతము మీద పది ఆజ్ఞలు ఇచ్చియుండెను.

(ఈ పదములను కూడా చూడండి: ఎడారి, ఐగుప్తు, హోరేబు, వాగ్ధాన భూమి, పది ఆజ్ఞలు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:01 దేవుడు ఎర్ర సముద్రము ద్వారా ఇశ్రాయేలీయులను నడిపించిన తరువాత, ఆయన అరణ్యము ద్వారా సీనాయి అని పిలువబడే పర్వతము దగ్గరికి నడిపించెను.
  • 13:03 మూడు రోజులైన తరువాత, ప్రజలు తమ్మునుతాము ఆత్మీయకముగా సిద్ధపరచుకొనిన తరువాత, దేవుడు ఉరుములు, మెరుపులు మరియు ఆర్భాట శబ్దములతో సీనాయి కొండ మీదకి దిగివచ్చేను.
  • 13:11 అనేక రోజులపాటు మోషే సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుచుండెను.
  • 15:13 ఆ తరువాత దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు విధేయత చూపలేదని యెహోషువా ప్రజలకు తెలియజేసెను.

పదం సమాచారం:

  • Strong's: H2022, H5514, G3735, G4614