te_tw/bible/kt/lord.md

12 KiB
Raw Permalink Blame History

అధికారి, ప్రభువు, యజమాని, పెద్దమనిషి

నిర్వచనం:

బైబిలులో “అధికారి” పదం సాధారణంగా ప్రజలమీద హక్కుదారత్వం లేదా అధికారం ఉన్నవారిని సూచిస్తుంది. అయితే బైబిలులో ఈ పదం వివిధరకాలైన ప్రజలనూ, దేవుణ్ణి కూడా సంభోదించడానికి ఉపయోగించబడింది.

  • యేసును సంబోదిస్తున్నప్పుడు గానీ లేదా సేవకులను కలిగిన వ్యక్తిని సూచిస్తూఉన్నప్పుడు గానీ ఈ పదం “యజమాని” అని అనువదించబడుతుంది.
  • కొన్ని ఆంగ్ల అనువాదాలు పై స్థాయిలో ఉన్న వారిని మర్యాదగా సంబోధించే సందర్భంలో “అయ్యా (పెద్ద మనిషి)" అని దీనిని అనువదించాయి.

"ప్రభువు" పదం పెద్ద అక్షరాలతో గుర్తించబడినప్పుడు ఇది దేవుణ్ణి సూచిస్తున్న బిరుదు. (అయితే గమనించండి, ఒకరిని సంబోదిస్తున్న రూపంలో ఉపయోగించబడినట్లయితే లేదా వాక్యం ఆరంభంలో ఈ పదం ఉన్నట్లయితే ఇది పెద్ద అక్షరాలలో ఉండవచ్చు, దీనికి "అయ్యా" లేదా "యజమాని" అనే అర్థం ఉంటుంది.)

·         పాతనిబంధనలో, “సర్వశక్తిగల ప్రభువైన దేవుడు” లేదా “ప్రభువైన యెహోవా” లేదా “యెహోవా మా ప్రభువు” అనే వాక్యాలలో కూడా ఈ పదం ఉపయోగించబడింది.

·         కొత్తనిబంధనలో, “ప్రభువైన యేసు”, “ప్రభువైన యేసు క్రీస్తు” వంటి పదబంధాలలో ఈ పదాన్ని అపొస్తలులు ఉపయోగించారు. యేసు దేవుడని ఇది సూచిస్తుంది.

·         కొత్త నిబంధనలో “ప్రభువు” పదం దేవుణ్ణి నేరుగా సంబోధించడంలో కూడా ఉపయోగించబడింది. ప్రత్యేకించి పాతనిబంధన నుండి ఉల్లేఖనాలలో ఈ పదాన్ని ఉపయోగించారు. ఉదాహరణకు, “యెహోవా నామములో వచ్చువాడు ధన్యుడు” అనే పాతనిబంధన వాక్యభాగం, కొత్తనిబందన వాక్యభాగంలో “ప్రభువు నామంలో వచ్చువాడు ధన్యుడు.”

·         యు.ఎల్.టి మరియు యు.ఎస్.టి లో ”ప్రభువు” బిరుదు వాస్తవిక హెబ్రీ, గ్రీకు పదాలలోని “ప్రభువు” అని అర్థం ఇచ్చే పదాలను మాత్రమే అనువదించడానికి వినియోగించబడుతుంది. అనేక అనువాదాలలో చెయ్యబడినవిధంగా ఇది దేవుని పేరు (యెహోవా) అనువాదంగా ఎప్పుడూ ఉపయోగించబడలేదు.

·         కొన్ని అనువాదాలు “ప్రభువు” పదాన్ని “యజమాని” లేదా “పరిపాలకుడు” లేదా హక్కుదారత్వాన్నీ లేదా అత్యున్నత రాజ్యపాలనను తెలియపరచే ఇతర పదంగా అనువదించారు.

·         సరియైన సందర్భంలో, అనేక అనువాదాలు ఈ పదం దేవుణ్ణి సూచిస్తుందని పాఠకుడికి స్పష్టం అయ్యేలా ఈ పదంలోని మొదటి అక్షరాన్ని పెద్ద అక్షరంగా రాశారు.

·         కొత్తనిబంధనలో పాతనిబంధన నుండి వచనాన్ని ప్రస్తావించిన స్థలాలలో, అది దేవుని గురించి చెపుతున్నదని స్పష్టం చెయ్యడానికి  “ప్రభువైన దేవుడు” అనే పదం వినియోగించబడవచ్చు.

అనువాదం సూచనలు:

  • దాసులను కలిగిన వ్యక్తిని సూచించడానికి “యజమాని” పదానికి సమానమైన పదంతో ఈ పదం అనువదించబడవచ్చు. ఒక సేవకుడు తాను పనిచేస్తున్న వ్యక్తిని ఆ సేవకుడు పిలవడానికి కూడా ఈ పదం  వినియోగించబడవచ్చు.
  • ఈ పదం యేసును సూచిస్తున్నప్పుడు, ఆ ప్రసంగీకుడు చూస్తున్న సందర్భం యేసును ఒక మత బోధకునిగా చూపిస్తున్నట్లయితే ఒక మత నాయకుని విషయంలో “యజమాని” అని గౌరవంతో కూడిన సంబోధనతో అనువదించబడవచ్చు.
  • ఒక వ్యక్తి యేసును ఎరుగకుండా పిలుస్తున్నట్లయితే, “ప్రభువు” పదం మర్యాదపూర్వకమైన సంబోధనగా “అయ్యా” అని అనువదించబడవచ్చు. ఒక వ్యక్తిని మర్యాదపూర్వకంగా పిలువవలసిన ఇతర సందర్భాలలో కూడా ఈ అనువాదాన్ని వినియోగించవచ్చు.
  • తండ్రి అయిన దేవుణ్ణి లేదా యేసును సూచించే సందర్భంలో ఈ పదం ఒక బిరుదులా పరిగణించవచ్చు. “ప్రభువు” (పెద్ద అక్షరాలు) అని ఇంగ్లీషులో రాయ బడవచ్చు.

(చూడండి: God, Jesus, ruler, Yahweh)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __25:5__అయితే యేసు లేఖనాలనుండి వచనాలను ఎత్తి చూపుతూ సాతానుకు జవాబిచ్చాడు. “దేవుని వాక్యంలో, ‘నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని’ ఆజ్ఞాపించాడని చెప్పాడు.
  • 25:7 “సాతానా నా వెనుకకు పొమ్ము” అని ప్రభువు జవాబిచ్చాడు. దేవుని వాక్యంలో తన ప్రజలకు, “నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలెను” అని ఆజ్ఞాపించాడు.
  • 26:3 ఇది ప్రభువు దయా సంవత్సరం.
  • __27:2__దేవుని ధర్మశాస్త్రం “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలెను” అని చెపుతున్నదని ధర్మశాస్త్ర బోధకుడు జవాబిచ్చాడు.
  • 31:5  “ప్రభువా, ఇది నీవే అయితే, నీటి మీద నడుస్తూ నీ దగ్గరకు వచ్చేలా నాకు ఆజ్ఞ ఇవ్వు” అని పేతురు యేసుతో చెప్పాడు.
  • 43:9 దేవుడు యేసును ప్రభువుగానూ, క్రీస్తుగానూ చేసెనని ఖచ్చితంగా తెలిసికొనుడి.
  • __47:3__ఈ దయ్యము వలన ఆమె ప్రజల భవిష్యత్తును గురించి సోదె చెపుతూ, తన యజమానులకు బహు లాభాన్ని చేకూరుస్తుంది.
  • 47:11ప్రభువు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవునూ, నీ ఇంటివారునూ రక్షించబడుదురు” అని పౌలు జవాబిచ్చాడు.

పదం సమాచారం:

  • Strongs: H0113, H0136, H1167, H1376, H4756, H7980, H8323, G02030, G06340, G09620, G12030, G29620