te_tw/bible/other/house.md

4.3 KiB

ఇల్లు, ఇళ్ళు, ఇంటి కప్పు, ఇంటి కప్పులు, గిడ్డంగి, గిడ్డంగులు, గృహనిర్వాహకులు

నిర్వచనం:

"ఇల్లు" అనే మాటను బైబిల్లో తరచుగా అలంకారికంగా ఉపయోగిస్తారు.

  • కొన్ని సార్లు "ఇంటి వారు," అంటే ఒక ఇంట్లో కలిసి నివసించే మనుషులు.
  • తరచుగా "ఇల్లు" అంటే ఒక వ్యక్తి సంతానం, ఇతర బంధువులు. ఉదాహరణకు, "దావీదు ఇల్లు" అంటే దావీదు సంతానం.
  • “దేవుని ఇల్లు” “యెహోవా ఇల్లు" అంటే ప్రత్యక్ష గుడారం, లేదా ఆలయం. ఈ మాటలు సాధారణంగా దేవుడు నివసించే చోటును కూడా సూచిస్తాయి.
  • హెబ్రీ 3లో "దేవుని ఇల్లు" అనే మాటను రూపకాలంకారంగా దేవుని ప్రజలను లేక సాధారణంగా, దేవునికి చెందిన ప్రతిదాన్నీ సూచించడానికి వాడారు.
  • "ఇశ్రాయేలు ఇల్లు" అంటే సాధారణంగా మొత్తం ఇశ్రాయేలు జాతి లేక ఇదమిద్ధంగా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం గోత్రాలు.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "ఇల్లు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"ఇంటి వారు” లేక “ప్రజలు” లేక “కుటుంబం” లేక “సంతానం” లేక “ఆలయం” లేక “నివాస స్థలం."
  • "దావీదు ఇల్లు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దావీదు వంశం” లేక “దావీదు కుటుంబం” లేక “దావీదు సంతానం." సంబంధించిన అనే మాటలు ఇలానే అనువదించ వచ్చు.
  • "ఇశ్రాయేలు ఇల్లు" అనే మాట అనువాదం "ఇశ్రాయేలు ప్రజలు” లేక “ఇశ్రాయేలీయుల సంతానం” లేక “ఇశ్రాయేలీయులు."
  • "యెహోవాఇల్లు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యెహోవా ఆలయం” లేక “యెహోవాను ఆరాధించే చోటు” లేక “యెహోవాతన ప్రజలను కలుసుకునే చోటు” లేక “యెహోవా నివసించే చోటు."
  • "దేవుని ఇల్లు" అనే దాన్ని ఇలా ఇదే విధంగా అనువదించ వచ్చు.

(చూడండి: దావీదు, సంతతి వాడు, ఇల్లు దేవుని, ఇంటి వారు, ఇశ్రాయేల్ రాజ్యం, ప్రత్యక్ష గుడారం, ఆలయం, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1004, H1005, G3609, G3613, G3614, G3624