te_tw/bible/names/david.md

6.0 KiB

దావీదు

వాస్తవాలు:

దావీదు ఇశ్రాయేలు రెండవ రాజు. అతడు దేవుణ్ణి ప్రేమించాడు, సేవించాడు. అతడు కీర్తనల ముఖ్య కవి.

  • దావీదు యవ్వన ప్రాయంలోనే తన కుటుంబానికి చెందిన గొర్రెలను మేపాడు. దేవుడు ఎన్నుకొనగా అతడు ఇశ్రాయేలు రాజు అయ్యాడు.
  • దావీదు గొప్ప యోధుడుగా ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధాల్లో వారి శత్రువులకు వ్యతిరేకంగా నడిపించాడు. ఫిలిష్తియ వాడైన గొల్యాతు సంహారం ప్రసిద్ధం.
  • దావీదు చంపడానికి సౌలు రాజు ప్రయత్నించాడు. అయితే దేవుడు అతణ్ణి కాపాడాడు. సౌలు మరణం తరువాత అతన్ని రాజుగా నియమించాడు.
  • దావీదు ఒక భయంకర పాపం చేశాడు. అయితే అతడు పశ్చాత్తాప పడినందువల్ల దేవుడు అతన్ని క్షమించాడు.
  • యేసు, మెస్సియాకు "దావీదు కుమారుడు" అని పేరు. ఎందుకంటే అతడు దావీదు రాజు సంతతి వాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: గొల్యాతు, ఫిలిష్తీయులు, సౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 17:02 దేవుడు బెత్లెహేము ఊరి వాడైన దావీదు అనే పేరు గల ఒక ఇశ్రాయేలు యువకుడిని ఎన్నుకొన్నాడు. అతడు సౌలు తరువాత రాజు కావాలి. దావీదు గొర్రెల కాపరి దావీదు వినయపూర్వకమైన నీతిపరుడైన మనిషి, దేవునిపై నమ్మకముంచి ఆయనకు లోబడిన వాడు.
  • 17:03 దావీదు గొప్ప సైనికుడు, నాయకుడు కూడా. దావీదు యువకుడుగా ఉన్నప్పుడే అతడు గొల్యాతు అనే పేరుగల మహా కాయునితో పోరాడాడు.
  • 17:04 దావీదు పట్ల మనుషులు చూపే ప్రేమకు సౌలు అసూయ చెందాడు. సౌలు అనేక సమయాలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు సౌలునుండి తప్పించుకుని పారిపోయాడు.
  • 17:05 దేవుడు దావీదును దీవించి అతనికి విజయాలు ఇచ్చాడు. దావీదు అనేక యుద్ధాలు చేసి దేవుని సహాయంతో ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించాడు.
  • 17:06 ఇశ్రాయేలీయుల దైవారాధన కోసం, బలి అర్పణల కోసం దావీదు ఒక ఆలయం కట్టించాలనుకున్నాడు.
  • 17:09 దావీదు అనేక సంవత్సరాలు న్యాయంతో నమ్మకత్వంతో పరిపాలన చేశాడు. దేవుడు అతన్ని దీవించాడు. అయితే, తన జీవితం చివర్లో అతడు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేశాడు.
  • 17:13 దావీదు చేసిన దానికి దేవుడు చాలా కోపగించుకున్నాడు. కాబట్టి ఆయన నాతాను ప్రవక్తను పంపి దావీదుకు అతడెలా దుష్టతరమైన పాపం చేశాడో చెప్పాడు. దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. తన తక్కిన జీవితమంతా దావీదు దుర్లభ సమయాలలో సైతం దేవునికి లోబడి ఆయన్ను వెంబడించాడు..

పదం సమాచారం:

  • Strong's: H1732, G1138