3.9 KiB
3.9 KiB
సౌలు (పాతనిబంధన)
వాస్తవాలు:
సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉండుటకు దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలీయుడైయుండెను.
- సౌలు ఎత్తుగా ఉండి అందగాడైయుండెను, మరియు శక్తివంతమైన సైనికుడైయుండెను. ఇశ్రాయేలీయులందరు తమకు రాజుగా ఇతనే ఉండాలని కోరుకొనిన వ్యక్తియైయుండెను.
- ఇతను మొట్ట మొదటిగా దేవునిని సేవించినప్పటికీ, సౌలు కొంచెం కాలమైన తరువాత అహంకారముగలవాడై దేవునికి అవిధేయుడాయెను. దీనికి ఫలితముగా, సౌలు స్థానములో రాజుగా దేవుడు దావీదును నియమించి, యుద్ధములో సౌలు చంపబడుటకు అనుమతించబడెను.
- క్రొత్త నిబంధనలో పౌలు అనబడిన సౌలు అనే ఒక యూదుడు ఉండేవాడు, ఈయన యేసు క్రీస్తు అపొస్తలడుగా మారెను.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: రాజు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:
- 17:01 సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఇతను ప్రజలందరూ కోరుకొనే విధముగానే ఎత్తుగాను మరియు అందముగాను ఉండేవాడు. సౌలు ఆరంభములో ఇశ్రాయేలును ఏలిన కొన్ని సంవత్సరములవరకు మంచి రాజుగా పరిపాలించెను. అయితే ఆ తరువాత కొంత కాలానికి దుష్ట రాజుగా మారి, దేవునికి అవిధేయత చూపెను, అందుచేత దేవుడు సౌలు స్థానములో రాజుగా ఉండుటకు ఇంకొక వ్యక్తిని ఎన్నుకొనియున్నాడు.
- 17:04 ప్రజలందరూ దావీదును ప్రేమించుచున్నందుకు సౌలు అసూయ పడెను. సౌలు అతనిని చంపుటకు అనేక రీతులుగా ప్రయత్నాలు చేసెను, అందుచేత దావీదు సౌలుకు చిక్కకుండా దాచిపెట్టుకొనెను.
- 17:05 చిట్ట చివరికి, సౌలు యుద్ధమందు మరణించెను, మరియు దావీదు ఇశ్రాయేలు రాజుగా మారెను.
పదం సమాచారం:
- Strong's: H7586, G4549