te_tw/bible/other/king.md

5.5 KiB

రాజు, రాజులు, రాజ్యం, రాజ్యాలు, రాచరికం, రాచ ఠీవిగా

నిర్వచనం:

“రాజు” అనే పదం ఒక పట్టణానికే, రాష్ట్రానికీ లేక దేశానికీ సర్వశ్రేష్ఠమైన పాలకుడిగా ఉన్న వ్యక్తిని సూచిస్తుంది.

  • ఒక రాజుకు తనకు ముందున్న రాజులతో ఉన్న కుటుంబ సంబంధం కారణంగా సాధారణంగా ఎంపిక చెయ్యబడతాడు.
  • ఒక రాజు చనిపోయినప్పుడు, సాధారణంగా తన పెద్ద కుమారుడు తదుపరి రాజు అవుతాడు.
  • పురాతన కాలాలలో, రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజల మీద సంపూర్ణమైన అధికారాన్ని కలిగియుంటాడు.
  • ”రాజు” అనే పదం క్రొత్త నిబంధనలో నిజంగా రాజు కాని “రాజైన హేరోదు” లాంటివారికి ఆరుదుగా వినియోగించబడింది.
  • బైబిలులో, తరచుగా దేవుడు తన ప్రజలమీద పరిపాలన చేస్తున్న రాజుగా సూచించబడ్డాడు.
  • ”దేవుని రాజ్యం” తన ప్రజలమీద దేవుని పరిపాలనను సూచిస్తుంది.
  • యేసు “యూదులకు రాజు,” “ఇస్రాయేలుకు రాజు,” “రాజులకు రాజుగా” పిలువబడ్డాడు.
  • ప్రభువైన యేసు తిరిగి వచ్చినప్పుడు లోకాన్ని ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు.
  • ఈ పదం, “సర్వశ్రేష్ఠ ప్రధాని” లేక “సంపూర్ణ నాయకుడు” లేక “సార్వభౌమ పాలకుడు” అనికూడా అనువదించవచ్చు.
  • ”రాజుల రాజు” అనే పదం “ఇతర రాజులందరి మీద పరిపాలన చేస్తున్న రాజు” లేక “ఇతర పరిపాలకులందరి మీద అధికారం కలిగిన సర్వశ్రేష్ఠ పరిపాలకుడు” అని కూడా అనువదించవచ్చు.

(చూడండి: అధికారం, హేరోదు అంతిపయ, దేవుని రాజ్యం)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు వృత్తాంతముల నుండి ఉదాహరణలు:

  • 08:06 ఒక రాత్రి, ఫరో(ఐగుప్తీయులు తమ రాజును ఈ విధంగా పిలుచుకొంటారు,) రాజుకు రెండు కలలు వచ్చాయి, అవి అతనిని అధికంగా కలవరపరచాయి.
  • 16:01 ఇశ్రాయేలీయులకు రాజు లేడు, కనుక ప్రతి వాడును తన తన ఇస్త్తానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.
  • 16:18 చివరిగా ప్రజలు ఇతర దేశాలకు ఉన్నట్టుగా ఒక రాజు కొరకు దేవుణ్ణి అడిగారు.
  • 17:05 కాలక్రమంలో సౌలు యుద్ధంలో చనిపోయాడు, దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు. అతను మంచి రాజు, ప్రజలు అతనిని ప్రేమించారు.
  • 21:06 దేవుని ప్రజలు కూడా మెస్సయను ప్రవక్త అని పిలిచారు, ప్రధాన యాజకుడు, ఒక రాజు.
  • 48:14 దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, అయితే ప్రభువైన యేసు సమస్త లోకానికి రాజు!

పదం సమాచారం:

  • Strong's: H4427, H4428, H4430, G935, G936